మాటల మాంత్రికుడు, గురూజీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ – మరో డైరెక్టర్ సినిమాకి అందులోను రీమేక్ కి మాటలు రాయడానికి ముందుకు రావడం గురూజీ అభిమానులను సంతోష పరుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల మీద, రచనల మీద సాధారణం గానే కాపీ ముద్రలు ఎక్కువ ఉంటాయి . అసలు ఎవరికీ దొరకకుండా , కాపీ కొట్టడంలో మాస్టర్ కాబట్టే – ఆయనని గురూజీ అని పిలుస్తున్నారని అనే క్రిటిక్స్ లేకపోలేదు. రచయిత గా తన మార్క్ సృష్టిచుకున్నా, రీమేక్స్ లో మాత్రం తక్కువ మార్కులు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. ఆ ముచ్చట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రివిక్రమ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయిన ” నువ్వే కావాలి ” సినిమా మళయాళ సూపర్ హిట్ ‘ నిరం’ కి రీమేక్ . అలాగే నాగార్జున , శ్రీకాంత్, సౌందర్య నటించిన ” నిన్నే ప్రేమిస్తా !” కి త్రివిక్రమ్ డైలాగ్స్ రైటర్. ఆ సినిమా నే వారను ఎన ” అనే తమిళ్ సినిమా రీమేక్. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ” తీన్ మార్ “, హిందీ ” లవ్ ఆజ్ కల్ ” రీమేక్ అనే సంగతి అందరికి తెలిసిందే . ఇక ఇప్పుడు చేస్తున్న ” అయ్యప్పనుమ్ కోషియుమ్ ” మలయాళ రీమేక్ గురూజీ రాస్తున్న నాలుగవ రీమేక్. వీటి విషయం పక్కన పెడితే..
త్రివిక్రమ్ సినిమాలు తెలుగు లో సూపర్ హిట్ అయినా, ఇతర భాషల్లో ఆ చిత్రాల రీమేక్స్ ఘోర పరాజయం పాలు అయ్యాయి. ‘ చిరునవ్వు తో’ సినిమా తమిళంలో విజయ్ హీరోగా ” యూత్ ” అనే పేరిట రీమేక్ అయింది. కన్నడం లో రవిచంద్రన్ తో ” ప్రేమక్కే సాయి” అని రీమేక్ చేశారు . ఆ రెండు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం రాబట్ట లేకపోయాయి. అలాగే.. ‘స్వయంవరం’ సినిమా హిందీలో ‘క్యా దిల్ నే కహా’, తమిళంలో ” లవ్ మ్యారేజ్ ” అని రీమేక్ చేశారు . ఈ రెండు వెర్షన్స్ కూడా ప్లాప్ అయ్యాయి. తెలుగులో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ” నువ్వు నాకు నచ్చావు ” సినిమా కన్నడంలో ఉపేంద్ర హీరోగా ‘ గౌరమ్మ’ అని తీశారు . తమిళంలో విజయ్ తో ” వసీగారా ” అని తీశారు . ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి . ఇక ” మన్మధుడు ” సినిమా కన్నడ రీమేక్ ” ఐశ్వర్య ” తో దీపికా పదుకొనె హీరోయిన్ గా సినిమా రంగానికి పరిచయం అయింది . అందులో ఉపేంద్ర హీరో. ఆ సినిమా కూడా డిసాస్టర్.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల విషయానికొస్తే…
అతడు ” సినిమా హిందీలో బాబీ డియోల్ హీరోగా , ” ఏక్” అని రీమేక్ చేశారు . పరాజయానికే పరాకాష్ఠ గా నిలిచింది. అలాగే.. జులాయి తమిళ రీమేక్ ప్రశాంత్ హీరోగా ” సాగసం ” అని తీస్తే అదీ ప్లాపే. ఇక ఇండస్ట్రీ హిట్ అయిన ” అత్తారింటికి దారేది ” సినిమా తమిళంలో శింబు తో , కన్నడంలో సుదీప్ తో రీమేక్ చేశారు. ఈ రెండూ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి.
త్రివిక్రమ్ రీమేక్ సినిమాలకి డైలాగ్స్ రాస్తే – సూపర్ హిట్.!
కానీ .. త్రివిక్రమ్ కథలు ఇతర భాషల్లో రీమేక్స్ చేస్తే , బాక్సాఫీస్ ముందు తేలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే ఒకటే సమాధానం. గురూజీ తన సినిమాల్లో, కథా బలం కన్నా డైలాగ్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. ఆ మ్యాజిక్ రీమేక్స్ లో జరగదు కాబట్టి .. అవి ఫ్లోప్స్ అవుతున్నాయి. మాటల మాంత్రికుడు అనేది బిరుదే . కానీ టాప్ డైరెక్టర్ అయినా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని దర్శక మాంత్రికుడు అనో, కథా మాంత్రికుడా అనో ఎందుకు జనం అనడం లేదు. ఇదే త్రివిక్రమ్ బలం – బలహీనత !!