దిగజారుతున్న అధికారం .. ఎగబాకుతున్న విపక్షం!
రోజురోజుకు అధికారం పార్టీ రాష్ట్రంలో దిగజారిపోతోంది. జగన్ రెడ్డి పాలనకు విసిగివేసారిన ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలే అధికారపార్టీ దాష్టికానికి అద్దం పట్టేల వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన వైసీపీ నేటి ఫలితాల్లో అదే ఆధిక్యం కనపర్చడంలో ఢీలా పడింది. కేవలం 2 శాతం ఆధిక్యతతోనే గట్టెక్కింది. ప్రతిపక్ష తెలుగుదేశం గతం కన్నా మిన్నగా మెరుగైన ఓటు బ్యాంక్ ను సాధించుకుంది. నెల్లూరు తోపాటు 12 మున్సిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల్లో ఫలితాల్లో వైసీపీ 45 శాతం ఓట్లను రాబట్టగా, తెలుగుదేశం 43 శాతం ఓట్లను రాబట్టగలిగింది. అయితే రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 2 శాతమే. గడిచిన రెండునరేళ్ళ కాలంలో అధికారపార్టీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతలా వ్యతిరేకతను మూటకట్టుకుందో ఈ ఫలితాలతోనే తేటతెల్లమౌతోంది. అధికారపార్టీ కన్నా టీడీపీ 3.01శాతం ఓట్లు ఆధిక్యంతో పైకి ఎగబాకగా .. వైసీపీ 5 శాతం ఓట్లను కోల్పొయి పాతాళానికి దిగజారింది.
పునరుత్తేజంతో పుంజుకుంటున్న టీడీపీ!
తాజాగా నిర్వహించిన లోకల్ వార్‌లో టీడీపీ పునరుత్తేజంతో పుంజుకుంటుంది. ఎన్నికల బరిలో దాడులను, కేసులను, బెదిరింపులను ఎదుర్కొంటూ తమ్ముళ్లు దైర్యంగా నిలించారనే చెప్పవచ్చు. పోలీసులను, ఎన్నికల అధికారులను అడ్డంపెట్టుకుని ఏకగ్రీవాలు, నామినేషన్ ఉపసంహరణకు వత్తుళ్లు, దాడులు, అక్రమ కేసులు, విచ్చలవిడిగా డబ్బు పంచి ఓట్లును కొనుగోలు చేయడం వంటి అరాచకాలకు పాల్పడినా చివరికి తెలుగుదేశం వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఇన్ని చేసిన కూడా అధికారపార్టీ సాధించింది కేవలం 2% మేరకు ఓట్లే. మరోపక్క టీడీపీ గతంకన్నా మెరుగ్గా పుంజుకుంది. 12 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు దర్శి నగరపంచాయితీని అత్యధిక మెజారిటీతో కౌవసం చేసుకోగా .. దాచేపల్లిలో ఆల్మోస్ట్ గెలుపుకు దెగ్గరగా వెళ్లి అధికారపార్టీ రీకౌంటింగ్ డ్రామాతో వచ్చిన ఫలితాలు తారుమారయ్యాయి. మిగతా చోట్ల చాలాంటే చాలా ఎడ్జిలో టీడీపీ ఓడింది. మొత్తం వార్డుల విషయానికి వస్తే 328 వార్డులకు గానూ తెలుగుదేశం దాదాపు 150 వార్డులను కౌవసం చేసుకుంది. దర్శి విషయానికి వస్తే.. 2019 లో అధికారపార్టీకి 39 వేల ఓట్లు ఆధిక్యం సాధించి కంచుకోటగా భావిస్తే .. అక్కడ కూడా భారీ పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. టీడీపీ ఇక్కడ భారీ మేజారిటీతో విజయం కేతనం ఎగరవేసింది.
అధికార దర్పానికి తెదేపా షాక్ !
మని లోకల్ వార్‌లో ప్రధానం రెండు కొసమెరుపులు గురించి ప్రస్తావించుకోవాలి. ఒకటి కర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిపాలిటి అయితే.. రెండోవది గుంటూరు నగరపాలక సంస్థ. ఈ రెండింటిలో తెలుగుదేశం పార్టీ కొట్టిన దెబ్బకు అధికార అధిష్టానం అబ్బా అన్నంత పనైంది. బేతంచెర్ల మున్సిపాలిటీలో ఆర్థిక శాఖమంత్రి బుగ్గనకు టీడీపీ షాకిచ్చింది. ఆయన నివాసం ఉండే 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 88 ఓట్లతో విజయం సాధించారు. అలానే 20 వార్డులకు వైసీపీ 8 లో విజయం సాధిస్తే.. టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించి గట్టిపోటినిచ్చింది. ఇక్కడ టీడీపీ చేజార్చుకున్న వార్డుల్లో మేజారిటీ అత్యల్పమేనని చెప్పుకోవాలి. అలానే గుంటూరు నగరం పాలక సంస్థలోని 6వ డివిజన్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి సమత 537 ఓట్లతో గెలుపొందింది. అయితే ఈ స్థానం వైఎస్సార్సీపీ సిట్టింగ్ డివిజన్ కావడం విశేషం.
Must Read ;-లోకల్ వార్‌లో నైతిక విజయం టీడీపీదే!