మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అనే మాటల్ని చిత్ర పరిశ్రమలో ఉన్న వారు నూటికి నూరు శాతం నిజం చేస్తుంటారు. ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తీ పలికే తియ్యటి మాటల వెనుక లోతైన అవసరాలు దాగుంటాయి. అవసరం లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏకాకిగా మిగాలాల్సిందే. అలానే ఈర్ష్య, ద్వేషం, ఈగోలు కూడా పరిశ్రమకి పంచభూతాల్లా వ్యవహరిస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో దాదాపు 9 మంది హీరోలు ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
వాస్తవానికి ఈ 9 మంది హీరోలు ఒకే వర్గానికి, కుటుంబానికి చెందిన వారే కానీ ఒకరంటే ఒకరికి లోలోతుల్లో ద్వేషం, ఈర్ష్య ఉంటాయని వారి సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ బ్యాచ్ లో మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తేజ్ కి, అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ కి అస్సలు పడటం లేదట. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థాయికి వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వెళ్లిపోయిందని అటు మెగా కాంపౌండ్ లో ఇటు అల్లు కాంపౌండ్ లో ఉన్న పెద్దలు ఆందోళన పడుతున్నారని సమాచారం.
ఇంతకీ వీరిద్దరి మధ్య ఇంత తారాస్థాయిలో గొడవ పుట్టడానికి కారణం రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ కెరీర్ లో ముందంజలో ఉండటమే. మెగా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ తనకంటూ ఓ సొంత ఫ్యాన్ బేస్ ని తయారుచేసుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్ అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి ఓ వర్గం సెపరేటుగా చీలిపోయింది. దీంతో మెజార్టీ మెగా ఫ్యాన్స్ కాస్తా ఇప్పుడు మైనారిటీలోకి వచ్చేశారు. దీంతో రామ్ చరణ్ అమాంతం ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గిపోయింది.
పవన్ రాజకీయాల్లోకి పర్మినెంట్ గా వెళ్లి నట్లు వెళ్లి మళ్లీ వెనక్కి రావడంతో మెగా ఫ్యాన్స్ బ్యాచ్ లోకి వచ్చేసిన పీకే ఫ్యాన్స్ మళ్లీ తమ సొంత గూటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య చీలికలు వస్తున్నాయని మెగా కాంపౌండ్ లో గట్టిగా వినిపస్తుంది. మరి ఈ పంచాయతీ చిరంజీవి వరకు వెళితే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్స్ డౌట్.