రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్ని ఒకేసారి ట్రాక్ ఎక్కించాడు. అందులో రాధేశ్యామ్ మూవీ ఒకటి. పాన్ ఇండియా కేటగిరిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో సైతం ఈ సినిమా విడుదల కాబోతోంది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రివీలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ మూవీకి సంబంధించిన ప్రతీ అప్టేట్ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్టేడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. రాధేశ్యామ్ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కావ్యమట. ఇది ఇంచుమించు మణిరత్నం, నాగార్జున ‘గీతాంజలి’ మూవీ తరహాలో ఉంటుందట. కేన్సర్ వ్యాధితో బాధపడే నాయికా నాయకులు .. ఒకరికొకరు ఇష్టపడి చావుగురించి ఎదురు చూడడమే గీతాంజలి కథాంశం.
రాధేశ్యామ్ కాన్సెప్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుందని టాక్. అయితే గీతాంజలి లోని ఏ పాయింట్ రాధేశ్యామ్ మూవీ స్టోరీ తో కలుస్తుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. హస్తసాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి నిజంగా రాధేశ్యామ్ కు , గీతాంజలికి పోలికలు ఉన్నాయో లేదో తెలియాలంటే.. జూలై 30 వరకూ ఆగాల్సిందే.
Must Read ;- క్రేజీ తమిళ దర్శకుడితో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా?