1. ప్రభాస్
వికీపీడియా సెర్చ్ లో నంబర్ వన్ పొజిషన్ లో నిలిచాడు ప్రభాస్. వికీపీడియాలో ఇతడి కోసం ఏకంగా 15.94 మిలియన్ నెటిజన్లు వెదికారు. ప్రభాస్ వయసు, అతడి అప్ కమింగ్ సినిమాలు, ప్రభాస్ ఎత్తు కోసం ఎక్కువమంది సెర్చ్ చేసినట్టు వికీపీడియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 3 సినిమాలున్నాయి. పైగా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కాబట్టి ప్రభాస్ టాప్ లో నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
2. విజయ్
ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలిచాడు. ఇతడి కోసం వికీపీడియాలో 15.82 మిలియన్ ప్రజలు వెదికారు. ఇలా వికీపీడియాకు వచ్చిన వాళ్లలో ఎక్కువమంది విజయ్ మూవీ అప్ డేట్స్ కోసమే వెదికారని, చాలా తక్కువమంది విజయ్ ఎక్కడ దుస్తులు కొంటాడు, ఏ బ్రాండ్స్ వాడతాడనే విషయంపై సెర్చ్ చేశారని తేలింది.
3. మహేష్ బాబు
లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచిన వ్యక్తి మహేష్ బాబు. వికీపీడియాలో ఇతగాడి కోసం 13.5 మిలియన్ యూజర్లు సెర్చ్ చేశారు. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేంటంటే.. ఇలా వెదికిన లక్షలాది మందిలో ఉత్తరాది జనాలే ఎక్కువగా ఉన్నారు. మహేష్ కొత్త సినిమాలతో పాటు అతడి వయసు, ఎత్తు, వాడుతున్న బ్రాండ్స్ కోసం వికీపీడియాలో ఎక్కువమంది వెదికారు.
4. రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక్కడ కూడా ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది వికీపీడియా. రజనీకాంత్ కోసం సెర్చ్ చేసి నెటిజన్లలో 90శాతం మంది యూత్ అంట. ఇప్పటికీ రజనీకాంత్ పై ఈ తరం అభిమానం చూపిస్తోందనడానికి ఇదే ఉదాహరణ. వికీపీడియాలో రజనీకాంత్ తోసం 12.9 మిలియన్ ప్రజలు చెక్ చేశారు.
5. అల్లు అర్జున్
ఇక లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచిన వ్యక్తి అల్లు అర్జున్. తన సినిమాలు, స్టయిల్ స్టేట్ మెంట్స్, అదిరిపోయే స్టెప్పులతో ఇండియా అంతటా అభిమానుల్ని సంపాదించుకున్న అల్లు అర్జున్, ఈ ఏడాది టాప్-5లోకి ఎంటరయ్యాడు. వికీపీడియాలో బన్నీకి సంబంధించిన వివరాల్ని 12.6 మిలియన్ నెటిజన్లు చదివారు. వీళ్లలో ఎక్కువమంది బన్నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాడు లాంటి విషయాల్ని చదివారట.
Must Read ;- బాలీవుడ్ కు పూత రేకుల రుచి చూపిన ప్రభాస్