నిపుణుల, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు.. ఇలా అందరూ ఒక మాట కామన్‌గా చెప్తుంటారు.. అదే ‘పంచదార’ తీసుకోవడం మానేయమని.. ఈ మాట చాలా సార్లు వింటూనే ఉంటాం. అసులు పంచదార తీసుకోకపోతే ఏమవుతుంది? ఎందుకని అందరూ పంచదారను శత్రువులా చూస్తారు? నిజంగా పంచదార తీసుకోవడం మానేస్తే అంత మేలు జరుగుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజమేనండి.. వారు చెప్పింది అక్షరాల నిజం.. శారీరకంగా, మానసికంగా కూడా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. పంచదార మానేయడం డ్రగ్స్‌ను మానేయడంతో సమానమంటున్నారు నిపుణులు. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ప్రయత్నించి చూస్తే సరి..‘పంచదార లేకుండా 28 రోజుల ఛాలెంజ్’కి సిద్ధమవుదాం రండి..
Must Read ;- పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..
ఆలోచనల్లో మార్పు ..

అసలు పంచదారకు.. ఆలోచనలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చాలా ఉందంటున్నారు నిపుణులు. మనకు నచ్చిన స్నాక్స్, ఆహారం తీసుకున్నప్పుడు మనలో ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ క్షణం ఎంతో ఆనందంగా అనిపించడం మనం గమనించే ఉంటాం. అందుకు కారణం మనకు ఆనందాన్నిచ్చే హార్మోన్లు విడుదల అవుడమే కారణమంటున్నారు నిపుణులు.
అదే జరుగుతుంది పంచదార మానేసిన మొదట్లో .. కానీ ఇది కాస్త రివర్స్‌లో ఉంటుంది. పంచదార మానేసిన కొత్తలో కాస్త చిరాకు, కోపం లాంటివి ఉంటాయి. ఎందుకంటే నచ్చిన ఫుడ్ తినకపోవడం వల్ల.. కానీ ఒక వారం నుండి 10 రోజులు గడవగానే మనలో మార్పు కనిపిస్తుంది. మనలో కొత్త మార్పులు వస్తాయి. నీరసం స్థానంలో కొత్త శక్తి వస్తుంది. శరీరంకూడా ఎంతో తేలిగ్గా, ఉత్సాహంగా ఉన్న భావన కలుగుతుందంటున్నారు నిపుణులు. పంచదారను మానేయడంతో పాటు.. దాని స్థానంలో ఓ మంచి డ్రింగ్ లాంటి దాన్ని తాగటం అలవాటు చేసుకోవడం మంచిది.
Also Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
హాయిగా నిద్ర..

హాయిగా నిద్రపోతే ఆ హుషారే వేరు! రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం, రోజుకి కనీసం 8-9 గంటలపాటు నిద్రపోవాలి. కానీ నేటి యువత కనీసం 7 గంటలు కూడా నిద్రపోవడం లేదు. ఇక ఆఫీస్ వెళ్లినపుడి నుండి మత్తుగా, చిరాగ్గా ఉంటుంది. పని కూడా సరిగా చేయలేరు. వీటన్నింటికీ పంచదార మానేయడం ద్వారా చెక్ పెట్టచ్చు. పంచదారకు స్వస్తి పలికే.. చక్కని నిద్రకు వెల్‌కమ్ చెప్పినట్లే అంటున్నారండీ నిపుణులు. మరి ఓ ట్రైయిల్ వేద్దాం రండి..
Also Read ;- ‘తల్లిపాల’ను పెంచే సూపర్ ఫుడ్స్
బరువు తగ్గుతారు..

ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో బరువు ఒకటి. చాలామంది బరువు అదుపులో పెట్టుకోవడానికి, తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో ఉంటే పంచదారకు గెట్లు మూసేయడం చాలా అవసరం. అప్పుడే బరువు తగ్గడమైనా.. అదుపు చేసుకోవడమైనా.. సాధ్యమవుతుంది. బరువు తగ్గి స్లిమ్ & ఫిట్‌గా కనిపించాలనే మీ కల నిజమవుతుంది.
Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?
అందం మీ సొంతం..

ఏంటి పంచదార మానేస్తే అందంగా తయారవుతామా? అసలు పంచదార ఏంటి? అందం ఏంటి? కన్‌ఫ్యూజ్ అవకండి.. పంచదార మానేయడం వల్ల ముఖంపై పింపుల్స్, దురదలు, చర్మ సమస్యలు వంటి వన్నీ తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. పంచదార మానేసి.. నేచురల్ షుగర్స్‌ని తీసుకోవడం వల్ల చర్మం పొరల్లోని కొలజిన్ అనే పదార్థంపై అనుకూల ప్రభావం పడుతుంది. దాని వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు దూరమై ‘మచ్చ లేని చందమామ’లా మెరిసిపోవడం ఖాయమంటున్నారు చర్మ నిపుణులు. అందంగా కనిపిస్తారంటే.. ఒప్పుకోని వారుంటారా? ఇంకెందుకు ఆలస్యం.. షుగర్‌కి నో చెప్పేయండి.. అందంగా మారిపోండి.
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!











