ప్రముఖ హాలీవుడ్ క్యారెక్టర్ నటుడు థామస్ జెఫెర్సన్ బైర్డ్ ని అక్టోబర్3 న గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు . థామస్ జెఫర్సన్ అధిక శాతం స్పైక్ లీ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు . మొదట స్టేజి డ్రామాలు, తర్వాత టీవీ సీరియల్స్ లో చేసిన పాత్రలతో ఎంతో పాపులర్ అయ్యారు.
గర్ల్-6 , క్లోకెర్స్ , రెడ్ హుక్ సమ్మర్ మొదలు అయిన స్పైక్ లీ సినిమాలు , థామస్ జెఫర్సన్ ని మరింత జనాదరణ పొందేలా చేసాయి . నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘షీఈజ్ గోటా హెవ్ ఇట్’ సిరీస్ లో కూడా గుర్తుండిపోయే పాత్ర చేసారు థామస్ జెఫర్సన్ . ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు .
జార్జియా లోని అట్లాంటా సిటీ లో అక్టోబర్3 న తెల్లవారు ఝామున 1.45 నిమిషాలకు థామస్ వీపులో బుల్లెట్లు దింపి , దారుణం గా హత మార్చారు . ఎవరు ఎందుకు కాల్చి చంపారనేది ఇంకా తెలియలేదు . పోలీసులు దర్యాప్తు చేపట్టారు.