దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా సీఎంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో..2009లో ఆస్తులన్నీ చట్టబద్ధంగా, సమానంగా పంచాలని, నలుగురు మనవలు-మనవరాళ్లకు సమాన వాటాలు దక్కాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు తండ్రి చెప్పిన మాటకు జగన్ సైతం ఓకే చెప్పారు. ఐతే అనూహ్యంగా ఆస్తులు సమానంగా పంచాలని చెప్పిన 2 నెలల్లోనే వైఎస్ మరణించారు. తర్వాత శవ రాజకీయాలు, ఓదార్పు యాత్రలు, వైఎస్సార్‌లా ఇమిటేట్ చేస్తూ సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్..ఆస్తుల విషయంలో తండ్రి మాటను పక్కన పెట్టేశారు.
YSR అధికారంలో ఉన్న నాటి నుంచి మరణించేంత వరకు షర్మిల బెంగళూరులోని యలహంక నివాసంలోనే ఉంటూ వచ్చింది. YSR స్వయంగా ఈ ఇంట్లో కూతురు గృహ ప్రవేశం వేడుకకు కూడా హాజరయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలాంటి ప్రముఖ దినపత్రికలు..YSR ఓ ప్రైవేట్ కార్యక్రమానికి బెంగళూరుకు వచ్చారని కథనాలు కూడా ఇచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆర్టికల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి చిన్నతనం నుంచే బెంగళూరులోని యలహంకలోనే పెరిగింది, ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. విజయమ్మ రాసిన నాలో నాతో YSR అనే పుస్తకంలో తెలిపినట్లుగా షర్మిల కుటుంబం దశాబ్ధాలుగా బెంగళూరులోనే నివసిస్తోంది. తాము పెరిగిన, ఎన్నో అనుబంధాలు ఉన్న అదే యలహంక నివాసంలో అంజలి రెడ్డి పెళ్లి జరిపించాలని షర్మిల భావించారు.
అయితే తండ్రికి చేసిన వాగ్ధానం..యలహంకతో పాటు ఆస్తులన్నీ నావే అంటూ జగన్ మెలిక పెట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. తన సొంత మేనకోడలి వివాహానికి కూడా యలహంక నివాసాన్ని వేదికగా ఇవ్వడానికి నిరాకరిస్తూ, అది తన వ్యక్తిగత ఆస్తి అని జగన్ వర్గం లీకులు ఇవ్వడం జగన్ వైఖరిని ఎండగడుతోంది. వైఎస్సార్ మరణం తర్వాత పార్టీ కోసం, జగన్ కోసం కష్టపడిన సొంత చెల్లెలికి, ఆమె పిల్లలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను నిరాకరించడమే కాకుండా, పెళ్లికి కూడా చోటు ఇవ్వకపోవడం జగన్ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని స్పష్టమవుతోంది.
YSR ఏనాడూ ఆస్తులన్నింటికీ జగన్ ఒక్కడే వారసుడని చెప్పలేదని, పిల్లలందరికీ సమాన హక్కులు ఉన్నాయని విజయమ్మ నోటరీ ప్రకటనలు సైతం ధృవీకరిస్తున్నాయి. తండ్రి రాజశేఖరరెడ్డి ఆశయాలకు, చెల్లెలికి ఇచ్చిన మాటలకు నీళ్లొదులుతూ జగన్ చేస్తున్న ఈ ఆస్తుల పోరాటం వైఎస్సార్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రల పేరిట వైఎస్సార్ పేరును వాడుకుని, జీవితంలో తండ్రి ఆఖరి కోరికను తొక్కేయడం జగన్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం.











