కలియుగ దైవం అందుకే కన్నెర్ర.. భక్తులారా ఇక రాకండి..!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులపై కలియుగ దైవం కన్నెర్ర చేశాడు. నా కొండకు రాకండి అంటూ శ్రీవారే ఆగ్రహించినా మాదిరిగా.. తిరుమలలో జరుగుతున్న వరస దుర్ఘటనలను అందరికీ బోధపడున్నాయి.
ఏడుకొండలు ఎక్కితే.. ఏడు జన్మల పాపాలు హరిస్తాయని అనాదిగా భక్తుల నమ్మకం. శేషాచలం అడవుల ప్రకృతి రమణీయతకు, సర్వరోగ హరం అన్నట్లు ఉంటాయి. తిరుమలకు వచ్చే భక్తులు వీటిన ఆశ్వాదించేందుకు ఎంతగానో ఇష్టపడతారు. సుదూర ప్రాంతాలనుంచి భక్తుల వారివారి మొక్కులు అనుసారం మెట్ల మార్గంలోనూ, లేక నేరుగా వాహనాలతో కొండపైకి వెళ్ళి శ్రీవారి దర్శించుకుని తరిస్తారు. ఏటా కోట్ల మంది భక్తుల దర్శనం.. వేల కోట్ల కానుకలు సమర్పించి క్షేమంగా తిరుగు ప్రయాణమవుతారు. ఇదంతా నిత్య జరిగే తంతే. అయితే అటువంటి పుణ్యధామం.. నేడు అభద్ర బావంతో ఎందుకు కునారిల్లుతోంది అన్నదే భక్తులు లేవనెత్తుతున్న ప్రశ్న.
ఆపద మొక్కులవాడి దర్శనంలో ఆపదలు ఎందుకు కలుగుతున్నాయి..? కలియుగ వైకుంఠనాధుడు కొండపై ఏం జరుగుతుంది..? ఓ సామాజిక వర్గం మదం అనాదిగా వస్తున్న ఆచారాలకు శరాఘాతంలా మారిందా..? నాస్తికులకు, క్రైస్తవులకు పరమ పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో పదవులు అప్పజెప్పటమే జరుగుతున్న అనర్థాలకు కారణమా..? మనిషి వాసనను రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టి అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్లే పెద్ద పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు భక్తులపై ఎందుకు దాడులకు తెగపడతున్నాయి..? శేషాచలం అడవుల్లో అసలేం జరుగుతుంది..? క్రూర మృగాలు ఎందుకిలా విజృంభిస్తున్నాయి..? గతంలో ఎన్నడు లేని విధంగా క్రూర మృగాలు భక్తులపై దాడులకు గల కారణాలేంటీ..? అన్న ప్రశ్నలు సగటు భక్తుడు లేవనెత్తుతున్న అనేక అనుమానాలు.
ఎటువంటి కట్టుదిట్టం లేని కాలంలోనే భక్తులకు చిన్నపాటి అపాయం కూడా కలగకుండా ఆ ఆపద మొక్కులవాడిని దర్శనం చేసుకుని.., క్షేమంగా ఇంటికి చేరుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తిరుమలలో లేకపోవడానికి కారణం అడవుల్లో జరిగే పెద్దపెద్ద పేలుళ్లేనని అంటున్నారు భక్తులు. పుష్ప సినిమాలో మాదిరిగా.. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు నుంచి ఎంతో మంది స్మగ్లింగ్ పుష్పాలు ఈ నాలుగునరేళ్ళల్లో ఎర్రచందనం కోసం శేషాచలాన్ని జల్లెడ పడుతున్నారని వాస్తవ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు కొన్ని వేల మెట్రిక్ టన్నులకు పైగా ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. శేషాచలం నలుదిశలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ జోన్ ను ఏర్పాటు చేసి.. ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక నుంచి వస్తున్న స్మగ్లర్ లపై ఉక్కుపాదం మోపారు. నిత్యం విరామం లేకుండా వరుస కూబింగ్స్ జరిపి ఎర్రచందనం స్మగ్లర్లను ఏరిపారేశారు. ఫారెస్ట్ అధికారులకు సర్వాధికారాలు ఇస్తూ.. రక్షణగా తుపాకులను కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అందజేసింది. ఇలా ఆ ఐదేళ్లలో విరివిగా నిఘా ఉంచి ఎంతో విలువైన ఎర్రచందనాన్ని కాపాడారు. ఇవే వార్తలను ఆ కాలంలో తరుచూ ప్రముఖ చానళ్ళు, వార్తా సంస్థలు, సోషల్ మీడియాలు ప్రముఖంగా ప్రచురించేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇటువంటి వార్తలు మచ్చుకైన కనిపించడం లేదు అన్నది వాస్తవం కాదా..? అటవీశాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ నాలుగున్నర ఏళ్ళు ఏ చెట్టు కింద నిద్రపోతున్నారని పర్యావరణ ప్రేమికులు, తిరుమలకు వచ్చే భక్తులు నిలదీస్తున్నారు. శేషాచలం అడవుల్లో విలువైన ఎర్రచందనంతోపాటు ఇంకా ఏదో అక్రమ మైనింగ్ అడ్డాలను ఏర్పాటు చేశారని, అందుకే భారీ పేళ్ళుళ్ళకు పాల్పడుతున్నారని ఇప్పటికే మాజీ ఫారెస్ట్ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.
అందుకే ఎక్కడో జనావాసాలకు దూరంగా ఉండే చిరుతలు, ఎలుగు బంట్లు తిరుమలకు వచ్చే భక్తులపై గతంలో ఎన్నడు లేని విధంగా దాడులు చేస్తున్నాయన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఏదో గ్రహణం పట్టినట్టి మాదిరిగా.. , ఆ స్వామే కన్నెర చేసినట్లు క్రూర మృగాలు ఇంతలా దాడులు చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అనర్థాలకు కారణం టీటీడీ చైర్మన్ పదవీ క్రైస్తవుడికి కట్టపెట్టాడమేనని భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. లక్షల కోట్లు ఆస్తులున్న శ్రీవారికి.. భక్తుల కోసం, భక్తుల రక్షణార్థం మెట్ల మార్గంలో కంచెను ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. క్రూర మృగాల చేతిలో భక్తులు చస్తుంటే.. అది చాలా అన్నట్టు క్రూర మృగాలు దాడి చేస్తే కర్రతో కొట్టి చంపండి అన్నట్లు .. దానికో జగన్ రెడ్డి నవ్వే ఫోటో పెట్టి భక్తులకు చేతికి ఇవ్వటంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చేతగాని ముఖ్యమంత్రి దొరకటం వన్య ప్రాణులకు సైతం ప్రాణ సంకటంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.