తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పర్వం జోరుగా సాగింది. నిన్నటితో ప్రచారం ముగిసింది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేశారు. అయితే తిరుపతి ఎన్నికలో గెలుపు అవకాశాలు టీడీపీకే ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి జరిగిందని, గడిచిన రెండేళ్ల వైసీపీ పాలనలో తిరుపతిలో ఇసుమంతైనా పనులు జరగలేదన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని ఆమె అన్నారు. ఏపీ ప్రజలు వైసీపీకి 22మంది ఎంపీలు ఇస్తే, కీలుబొమ్మలుగా మారారని, ఎలాంటి సమస్యలపో పోరాడటం లేదని ఆమె అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో కలసి విస్తృతంగా ప్రచారంలో చేయడం వల్ల టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.
ప్రచారం ముగిసింది
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నిన్నటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇక, ఈ నెల 17న పోలింగ్ చేపట్టి, మే 2న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
Must Read ;- వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు











