బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న ఓటింగ్. ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే పోలీంగ్ బూత్ లకు మాస్క్ లు, గ్లౌజ్ లతో హాజరైన ఎన్నికల సిబ్బంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఈసీ. పోలింగ్ కేంద్రాల వద్దకు మాస్క్ ఉంటేనే ఓటర్లకు అనుమతి. థర్మల్ స్క్రినింగ్ చేసి కరోనా లక్షణాలు లేని ఓటర్లను పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తున్న అధికారులు
243 స్థానాల్లో మొదటి విడతగా 71 స్థానాలకు జరుగుతున్న పోలింగ్. 71 స్థానాలకు పోటీ పడుతున్న 1066 మంది అభ్యర్థులు. ఎన్నికల బరిలో 952 మంది పురుషులు,114 మంది మహిళా అభ్యర్థులు. 71 స్థానాల్లో పోటీ చేస్తున్న NDA కూటమి. జేడీయూ 35, బీజేపీ 29, హెచ్ఏఎం 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి. 41 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎల్జెపి, 42 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ, 20 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్.
తొలివిడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనున్న రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు. నక్సల్ ప్రభావిత గయా,రోహతాస్, ఔరంగబాద్ సహా 6 జిల్లాల్లో జరగనున్న పోలింగ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన ఈసీ.
కోవిడ్ నిబంధనలు పాటించేలా పోలింగ్ బూత్ ల వద్ద ఏర్పాట్లు
ఒక్కో పోలింగ్ బూత్ లో 1000 మందికి ఓటర్లకు మాత్రమే అనుమతి. 80 ఏళ్ళ పైబడిన వారు, కోవిడ్ లక్షణాలు కలిగినవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్. ఈవీఎంలను సానిటైజ్ చేసి పోలింగ్ కు సిద్ధంగా చేసిన అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద సానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచిన అధికారులు.