సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ జోరు పెరిగింది. మనం సినిమా తర్వాత ఫ్యామిలీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది. అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ వలే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా మల్టీస్టారర్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మూవీ మొఘల్ రామానాయుడు కోరిక.. తనయుడు వెంకటేష్.. మనవడు రానా కలిసి సినిమా చేయాలని. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ కి తగ్గా కథ కోసం చూస్తున్నారు కానీ.. ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఈమధ్య దగ్గుబాటి మల్టీస్టారర్ గురించి వార్తలు వస్తున్నాయి.
రానా కూడా బాబాయ్ వెంకటేష్ తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మా కాంబినేషన్ కి సరిగ్గా సరిపోయే స్టోరీ సెట్ అయ్యిందని ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు రానా చెప్పారు కానీ.. డైరెక్టర్ ఎవరు అనేది చెప్పలేదు. అలాగే సురేష్ బాబు కూడా తమ్ముడు వెంకటేష్ – తనయుడు రానా కలిసి చేసే సినిమా గురించి ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరంటే.. శతమానంభవతి సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకున్న వేగేశ్న సతీష్.
అవును.. వేగేశ్న సతీష్ వెంకీ – రానాకు సరిగ్గా సరిపోయే స్టోరీ రెడీ చేసారట. అయితే.. లైన్ చెప్పారట. బాగా నచ్చిందట. ఇంకా ఫుల్ స్టోరీ రెడీ చేయాలి. అప్పుడు అందరికీ నచ్చాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది అని వేగేశ్న సతీష్ చెప్పారు. అంతా అనుకున్నట్టు జరిగితే.. వచ్చే సంవత్సరం ఈ దగ్గుబాటి మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.