మొదటినుంచి కూడా మోహన్ బాబులో భావావేశం తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన సినిమాల్లో ఆయన డైలాగ్స్ చెప్పే తీరు, చప్పట్లు కొట్టేవరకూ వదిలిపెట్టదు. అలాంటి మోహన్ బాబు దేశభక్తితో కూడిన కథా నేపథ్యంలో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘సన్ ఆఫ్ ఇండియా‘ అనే టైటిల్ ను సెట్ చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లేను మోహన్ బాబు అందించడం విశేషం.
ఈ సినిమాలో ఒక సందర్భంలో శ్రీరాముడి ధర్మబద్ధమైన పాలనను చాటిచెప్పే ఒక పాటను తెరపై ఆవిష్కరించనున్నారు. ఆ స్థానంలో ‘రఘువీర గద్యం’ను ఉంచితే బాగుంటుందనే అభిప్రాయానికి మోహన్ బాబు వచ్చారట. 11వ శతాబ్దంలో వేదాంత దేశికులవారు ఈ ‘రఘువీర గద్య’ను రచించారు. ఆ గద్యాని పాటగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో, రీసెంట్ గా ఇళయరాజాను మోహన్ బాబు కలిశారు. తన మనసులో మాటను ఇళయరాజా ముందుంచారు. ఆ విషయాన్నీ .. అందుకు సంబంధించిన వీడియోను మంచు విష్ణు వదిలాడు.
రఘువీర గద్యాన్ని మోహన్ బాబు చదివి వినిపిస్తూ ఉంటే, ‘పాటను మీరే పాడతారా?’ అని ఇళయరాజా అడిగారట. తనకి డైలాగులు చెప్పడమేగానీ పాడటం రాదంటూ మోహన్ బాబు నవ్వేశారట. ఈ విషయాన్ని గురించి కూడా విష్ణునే చెప్పాడు. విజువల్స్ తో ఈ పాటను ఒక రేంజ్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విష్ణు ఉన్నాడు. ఈ సినిమాకిగాను మోహన్ బాబుకి స్టైలిస్టుగా ఆయన కోడలు ‘విరానిక’ వ్యవహరిస్తుండటం విశేషం. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.
Must Read ;- నటుడు మోహన్ బాబు కు భారీ జరిమానా విధించిన జీ.హెచ్.యంసీ
To produce a movie with legends is a God sent opportunity for me. And to make a iconic prose into a song, only a legend could do it. I wanted to share this video with you.And brining the song visually is another story altogether; that I will share soon. #sonofindia @themohanbabu pic.twitter.com/Yo0USui7Ys
— Vishnu Manchu (@iVishnuManchu) February 20, 2021











