టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. యాక్టింగ్ లో ఈజ్ తో పాటు .. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు గా అతడు ఎంపికచేసుకొనే కథలు.. వెరైటీ పాత్రలు అతడికి అతి తక్కువ సమయంలో అత్యధిక పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ‘ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మాఇంటికి, ఛలో, కళ్యాణ వైభోగమే, అశ్వథ్థామ’ లాంటి సినిమాలతో దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాగశౌర్య సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది.
ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే.. యాక్షన్ మూవీ ‘లక్ష్య’ ప్రస్తుతం సెట్స్ మీదుండగా.. వరుడు కావలెనుతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక సినిమా కోసం నాగశౌర్య వెరైటీ మేకోవర్ తో రివీలయ్యాడు. అసలేమాత్రం గుర్తుపట్టని విధంగా క్లీన్ షేవ్ లో రివీలైన శౌర్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యన్.యస్ 22 గా తెరకెక్కుతోన్న సినిమా కోసమే శౌర్య ఈ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ ఫోటో ను నాగశౌర్య స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశాడు. ఈ సినిమా వినోద ప్రధానంగా సాగనుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో నాగశౌర్య లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా శౌర్యకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- బాలయ్యతో సినిమా గురించి నాగశౌర్య ఏమన్నాడో తెలుసా.?
It is a new year for my beard too 😉#newyearnewlook pic.twitter.com/YsfOgfynmz
— Naga Shaurya (@IamNagashaurya) January 5, 2021











