టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో .. చక్కటి కథాకథనాలతో సినిమాలు చేయడంలో ఆయన దిట్ట. ఎర్లియర్ గా ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు, గాడ్సే’ లాంటి చిత్రాల్లో నటిస్తోన్న ఆయన టాలెంట్ ను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం గుర్తించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘రామ్ సేతు’ లో ఒక ప్రత్యేక పాత్ర కు సత్యదేవ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
పురావస్తు శాఖలోని ఒక సైంటిస్ట్ గా అక్షయ్ కుమార్ నటిస్తోన్న రామ్ సేతు సినిమా ఇటీవలే అనౌన్స్ అయింది. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న రామ్ సేతుకి రామాయణ ఇతిహాసంతో లింక్ ఉన్న సంగతి తెలిసిందే. శ్రీరాముడు సీతాదేవిని శోధించే క్రమంలో వానర సైన్యం రామేశ్వరం వద్ద ఉన్న సముద్రం పై వారధి నిర్మించారు. ఆ వారధి మీదుగానే .. రాముడు, వానరసైన్యం రావణ లంకకు దండెత్తుతారు. ఈ చారిత్రక సత్యంపై పరిశోధనే రామ్ సేతు కథాంశం అని తెలుస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ కు అసిస్ట్ చేసే ఒక యువ సైంటిస్ట్ గా సత్యదేవ్ నటిస్తున్నాడని సమాచారం. ఇందులో నిజానిజాలంటో తెలియదు కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త వైరల్ గా మారింది.
Satyadev in Ram Setu Movie :
అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అరుణ భాటియా , విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా లో నష్రత్ బరుచా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానున్న రామ్ సేతు సినిమా ను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది. మరి రామ్ సేతు సినిమాతో సత్యదేవ్ .. బాలీవుడ్ లో బిజీ అవుతారేమో చూడాలి.
Also Read:సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రానికి విడుదల తేదీ ఖరారు










