‘నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నిన్నే ఇష్టపడ్డాను’ లాంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగులో లవర్ బాయ్ గా క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ .. ఆ తర్వాత తన స్టార్ డమ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. వరుస పరాజయాలతో తన క్రేజ్ ను , మార్కెట్ ను కోల్పోయాడు. ప్రస్తుతం వివిధ వ్యాపారాలతో బిజీగా ఉన్న తరుణ్ .. త్వరలో టాలీవుడ్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతున్నాడని సమాచారం. తరుణ్ స్నేహితుడు చెప్పిన ఓ న్యూఏజ్ లవ్ స్టోరీతో తరుణ్ రీ ఎంట్రీ ఖాయమైనట్టు తెలుస్తోంది.
త్వరలో స్టార్ట్ కాబోయే ఈ సినిమాకి సంబంధించిన కేస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకి తరుణ్ స్నేహితుడే దర్శకుడిగా పరిచయం కానుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఈ సినిమా అలరిస్తుందని చెబుతున్నారు. మరి తరుణ్ ఈ మూవీతో మళ్ళీ హీరోగా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
Must Read ;- మల్టీ ప్లెక్స్ రంగంలోకి టాలీవుడ్ రౌడీ హీరో!