‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ అండ్ స్టన్నింగ్ పాత్రతో టాలీవుడ్ జనానికి షాకిచ్చింది పాయల్ రాజ్ పుత్. అందులోని ఆమె స్టైలాఫ్ పెర్ఫార్మెన్స్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అయిపోవడంతో.. పాయల్ కు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో అవకాశాలు వస్తాయని, దాంతో ఆమె కథానాయికగా చక్రంతిప్పుతుందని జోస్యం చెప్పారు.
అవకాశాలు రావడం వరకూ నిజమే కానీ.. వచ్చినవన్నీ ‘ఆర్.ఎక్స్ 100’ తరహాలో బోల్డ్ పాత్రలే. తన స్కిన్ షోని ఎలివేట్ చేసే పాత్ర తో.. ‘ఆర్డీఎక్స్ లవ్’ లాంటి సినిమాను మాత్రమే ఆ తర్వాత ఆమె చేసింది. అయితే సినిమా ఘోరపరాజయం పాలయింది. దాంతో అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది పాయల్. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వీటి తర్వాత పాయల్ ఎలాంటి సినిమా చేస్తున్నా అందరూ ఆర్.ఎక్స్ 100 మూవీని గుర్తు చేసుకోవడం.. అలాంటి బోల్డ్ పెర్ఫార్మెన్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడంతో .. పాయల్ .. డిఫెన్స్ లో పడింది.
అందుకే ఆ తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’, వెంకీతో ‘వెంకీమామ’ సినిమాల్లో నటించి.. తనపై ఉన్న బోల్డ్ ముద్రను పోగొట్టుకోవాలని తపించింది. అయితే ఈ రెండు సినిమాల వల్ల పాయల్ కెరీర్ కు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ సినిమాల తర్వాత కూడా పాయల్ కు అన్నీ బోల్డ్ పాత్రలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె నాగార్జున బంగార్రాజులో ఐటెమ్ సాంగ్ చేయబోతోందనే వార్తలు వినిపించాయి. దాంతో పాయల్ వేగంగా స్పందించింది. బంగార్రాజు సినిమాలో తాను ఎలాంటి ఐటెమ్ సాంగ్ చేయడం లేదని, ఇక ముందు కూడా తాను అలాంటి పాత్రలు చేయబోనని కరాఖండి గా చెప్పేసింది. మరి పాయల్ కు ఇక ముందైనా.. మామూలు కథానాయిక పాత్రలు దక్కుతాయేమో చూడాలి.
Must Read ;- అందాలు ఆరబోయడంలో మాళవిక మాస్టర్.. కానీ