తెలుగు రియాల్టీ షోస్ లో అత్యధిక ప్రజాదరణ పొందినది ‘బిగ్ బాస్’ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ షో విజయవంతంగా 4 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ నాలుగింటికి ఓ రేంజ్ లో జనం కనెక్ట్ అయ్యారు. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ యన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నానీ రక్తికట్టించాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్ కు కింగ్ నాగార్జున తనదైన స్టైల్లో హోస్టింగ్ చేసి షో మీద మరింతగా ఆసక్తిని పెంచారు. ఇప్పుడు బిగ్ బాస్ 5వ సీజన్ కు రంగం సిద్ధమైంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్ గా అలరించబోతున్నారు.
నిజానికి ఈ పాటికే స్టార్డ్ అవ్వాల్సిన బిగ్ బాస్ 5 .. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కాస్తంత లేట్ గా స్టార్ట్ కానుంది. జూలైలో షో ప్రారంభం కాబోతందని వార్తలు వినిస్తున్నాయి. ఇందులో పాల్గొనే సెలబ్రిటీస్ లిస్ట్ రెడీ అవుతోందని తెలుస్తోంది. గత సీజన్ లో అంతగా ఎవరూ సెలబ్రిటీస్ కనిపించకపోవడంతో ప్రేక్షకులు కాస్తంత నిరాశచెందారు. అయితే ఆ సారి అలా కాకుండా.. షోను గ్లామర్ తో నింపే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని సమాచారం.
టాలీవుడ్ లో ప్రస్తుతం పేరున్న సెలబ్రీటీస్ లో పలువురు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ లిస్ట్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఉందట. నిజంగా అలా కానీ జరిగితే.. బిగ్ బాస్ 5 షో పాయల్ రాజ్ పుత్ వల్ల బ్రహ్మాండమైన టీఆర్పీ తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఒక్కరి వల్ల షో కు ప్రజాదరణ ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి నిజంగానే పాయల్ బిగ్ బాస్ 5 లో పార్టిసిపేట్ చేస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం