టాలీవుడ్ కి పరిచయమైన అందమైన కథానాయికలలో పాయల్ ఒకరు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో ఈ అమ్మాయి ఒక రేజ్ లో రెచ్చిపోయింది. గంపలకొద్దీ అందాలను గుమ్మరించింది. అంతే కుర్ర ప్రేక్షకులు ఫిదా అయ్యారు .. కూడబలుక్కుని తమ మనసులన్నీ పాయల్ కి రాసిచ్చేశారు. మంచునీటిలో వేసిన మంచి ముత్యంలా స్వచ్ఛంగా .. పాలనురగలో తేలే పగడంలా ఆకర్షణీయంగా కనిపించే పాయల్ కి ఆ సినిమా నుంచి అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గులాబీ రంగు మేనిఛాయ పాయల్ సొంతం. ఆ స్కిన్ టోన్ కి పడిపోని పడుచు మనసులు ఉండవంటే అతిశయోక్తి కాదేమో.

పాయల్ ను నడిచే సౌందర్యంగా యూత్ భావిస్తుంది .. ఆమె అందం వెంట చూపులను పరిగెత్తిస్తుంది. అబ్బాయిలంతా ఆమెను తమ కలల దేవతగా భావిస్తారు. తమ కలల్లోకి ఆహ్వానించేసి మరీ ముసుగుతన్నుతారు. పాయల్ సౌందర్యమేకాదు .. ఆమె స్వభావం కూడా సున్నితంగానే కనిపిస్తుంది. ఆమె మాట తీరులో అది తెలిసిపోతూనే ఉంటుంది. కాడమల్లెలాంటి పాయల్ ఇకపై బడా హీరోలతో చేయడానికి ఉత్సాహపడుతోంది. అందులో భాగంగానే హాట్ లుక్స్ తో కూడిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందరి చూపులను లాక్ చేసేసి కీస్ తన దగ్గర పెట్టుకుంటోంది.
గ్లామర్ పరంగా పాయల్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు .. ఆమె ఏ వంకాలేని నెలవంకనే. అయితే ఆమె జాడ తెలియక అదృష్టం ఎక్కడెక్కడో వెదుకుతున్నట్టుగా ఉంది. అందువల్లనే ఆశించిన స్థాయిలో ఇంకా దూసుకెళ్లలేకపోతోంది. అదృష్టం తోడైతే మాత్రం అమ్మడిని ఆపడం కష్టమే. ఈ భారీ అందాల భామ స్విమ్మింగ్ పూల్లో దిగితే సునామీ రావడం ఖాయమేనని అనిపిస్తుంది కదూ. పాయల్ కి స్విమ్మింగ్ అంటే ఇష్టమంటే, తమ మనసు మాల్స్ ను స్విమ్మింగ్ పూల్స్ గా మార్చేస్తాం అంటున్నారు అభిమానులు. ఏం చేస్తాం .. వాళ్ల ఆవేశం వాళ్లది!
Must Read ;- పాయల్ హాట్ లుక్కులు తట్టుకోవడం కష్టమే!











