వెన్నెల హాయిని ఇవ్వడం .. గంధం సుగంధాలను వెదజల్లడం ఎంత సహజమో, అందం ఆకర్షించడం ఆకట్టుకోవడం కూడా అంతే సహజం. అందం ఎక్కడ ఉంటే అక్కడే కుర్రాళ్లు తమ గుండె గుడారాలు వేసేస్తారు. అందమైన అమ్మాయిలను తమ ఊహల పల్లకిలో ఊరేగిస్తారు. అలాంటి కుర్రాళ్ల చూపులను తనవైపుకు తిప్పుకున్న గ్లామరస్ హీరోయిన్స్ లో పూనమ్ బజ్వా ఒకరు. చామంతుల్లా విచ్చుకున్న కళ్లతో ముద్దబంతిలా మురిపించడం పూనమ్ బజ్వా ప్రత్యేకత. అందాలను ఆరబోయడానికి ఎంతమాత్రం వెనుకాడకపోవడం ఆమె స్పెషాలిటీ.

సినిమాల్లోనే కాదు సోషమ్ మీడియాలోనూ అమ్మాయిది అదే తంతు. అందాలను దాచుకోవడం ఈ సొగసరికి అసలే తెలియని విద్య. హాటు హాటుగా కనిపిస్తూ .. కవ్విస్తూ ఈ సుందరి ఒక రేంజ్ లో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా కూడా అదే పని చేసింది. బ్లాక్ ఫ్రాక్ లో గుమ్మడి పువ్వులాంటి అందాలను ఆరబోస్తూ ఒక ఫొటో వదిలింది. ఇన్నేసి సొగసులను ఇంకా ఎంతకాలం మోయడం అన్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. తెల్ల గులాబీలు తెల్లబోయేలా చేస్తున్న ఈ అమ్మడి సొగసులు కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.

పూనమ్ బజ్వా తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు ఎక్కువగా చేసింది. తెలుగులో ఓ మూడు సినిమాలే చేసింది. వాటిలో ఆమెకి కొంచెం గుర్తింపు వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘పరుగు’ మాత్రమే. ఆ తరువాత ఈ అమ్మాయికి అవకాశాలు దక్కలేదో .. లేదంటే ఈ అమ్మాయి అంతగా దృష్టిపెట్టలేదో తెలియదుగానీ, తెలుగు తెరకి దూరమైపోయింది. ఈ సుందరి హాట్ ఫొటోలు చూస్తున్న కుర్రాళ్లు మాత్రం, ఆమెకి అవకాశాలు ఇవ్వాల్సిందేననే కసితో ఉన్నారు. మరి వాళ్ల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
Must Read ;- కొంచెం ఘాటు .. మరికొంచెం హాటు .. నభా నటేశ్











