నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని తెరకెక్కించి.. దర్శకుడిగా తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సస్ సాధించిన సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆతర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్, మాస్ మహారాజా రవితేజతో రాజా ది గ్రేట్, విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 ఇలా వరుసగా విజయాలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దీంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు..సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
ఇలా వరుసగా విజయాలు సాధిస్తుండడంతో ఇండస్ట్రీలో అందరి దృష్టి అనిల్ రావిపూడి వైపే. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అనిల్ రావిపూడితో సినిమా చేసేదుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 చేయడానికి రెడీ అవుతున్నాడు. కథ రెడీ చేసి ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే… అనిల్ రావిపూడి సడన్ గా సింహాచలంలో ప్రత్యక్షమయ్యారు. కారణం ఏంటంటే… ఆయన భార్య, పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కారణం ఏంటంటే… డిసెంబర్ లోనే ఎఫ్ 3 మూవీని స్టార్ట్ చేయనున్నారు.
అందుచేత ఎఫ్ 3 స్ర్కిప్ట్ కి సింహాచలంలో ప్రత్యేక పూజలు చేయించారని సమాచారం. ఈ పూజలు అనంతరం అక్కడ మీడియాతో అనిల్ రావిపూడి మాట్లాడుతూ…ఈ నెలలోనే ఎఫ్ 3 మూవీ ప్రారంభం కానుందని తెలియచేసారు. రెమ్యూనరేషన్స్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చిందని… వెంకీకి ఇచ్చినట్టే… తనకు 12కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలని వరుణ్ తేజ్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే… దిల్ రాజు ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసారని.. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా సెట్ అయ్యిందని సమాచారం.
ఎఫ్ 2 మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఎఫ్ 3 మూవీకి కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఎఫ్ 3 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి… బాక్సాఫీస్ వద్ద ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఎఫ్ 3 కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- కె.ఎఫ్.సి. కి ధీటుగా ఎంకేసీ చికెన్.. దటీజ్ మెగాస్టార్











