మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రానికి సూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ.. ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సోలో ‘బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే… మార్చి నుంచి థియేటర్స్ మూతపడ్డాయి. అప్పటి నుంచి థియేటర్లో సినిమా రిలీజ్ కాలేదు. కరోనా తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ సోలో ‘బ్రతుకే సో బెటర్’. చాలా మంది నిర్మాతలకు జనాలు థియేటర్ కి వస్తారా.? రారా.? అనేది డౌటు. అందుకనే ఈ సినిమా టీమ్ ప్రమోషన్ లో స్పీడు పెంచింది. ఈ 5 రోజులు ప్రమోషన్స్ ని గ్యాప్ లేకుండా చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి గెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళిని ఇన్వైట్ చేశారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చేందుకు రాజమౌళి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చెప్పారట. థియేటర్లకు జనాలను రప్పించడం కోసం ఇలా రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తుండడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. జనాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి మంచి మూవీ వస్తుందా చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా భారీ స్ధాయిలో రిలీజ్ కానుంది. మరి.. ఈ సినిమా చూడడానికి జనాలు వచ్చి మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువస్తారని ఆశిద్దాం.