యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్న జంటగా నటిస్తోన్న యాక్షన్ కమ్ స్పోర్ట్స్ మూవీ ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. మేకర్స్ .. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా ‘సీటీమార్’ టీజర్ ను విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో సాగే .. ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
గోపీచంద్, తమన్నా ఇద్దరూ మహిళల కబడ్డీ జట్టుకు కోచ్ లు కార్తీ, జ్వాలారెడ్డి గా నటిస్తోన్న ‘సీటీమార్’ లో విలన్ గా తరుణ్ అరోరా కనిపిస్తున్నారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ సినిమాలో భూమిక ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అప్సరారాణి, రహమాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బైట ఆడితే వేట’ అనే మాస్ డైలాగ్ తో గోపీచంద్ తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో చెలరేగబోతున్నాడని టీజర్ ను బట్టి అర్ధమవుతోంది. అలాగే.. కబడ్డి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. కబడ్డీ నేపథ్యంలో గతంలో వచ్చిన ‘కబడ్డి కబడ్డి, ఒక్కడు’ సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో సీటీమార్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. మరి ‘సీటీమార్’ తో ఏ రేంజ్ లో థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాడో చూడాలి.
Must Read ;- గోపీచంద్ మారుతి ‘పక్కా కమర్షియల్’ సెట్స్ పైకి ఎప్పుడు?