ట్రెండ్ మారింది.. సినిమాని కొత్తగా ఎలా ప్రమోట్ చేయాలా..? జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలా.? అని ఆలోచించి.. కొత్త కొత్త దారుల్లో ప్రమోషన్ చేస్తున్నారు. ప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో అయితే.. సినిమా వెరైటీగా ప్రమోట్ చేయడం ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఆయా సినిమాలో హీరో ఏ క్యారెక్టర్ లో కనిపిస్తాడో.. అదే క్యారెక్టర్.. అదే గెటప్ తో జనాల్లోకి రావడం… వాళ్లతో మాట్లాడడం… ఇలా చాలా చేస్తుంటారు. టాలీవుడ్ లో హీరోలు సినిమాలు చేస్తారు కానీ.. ప్రమోట్ చేయడానికి ఎక్కువ టైమ్ కేటాయించరు. ఏదో ఇంటర్ వ్యూ ఇచ్చేసి ప్రమోషన్ చేసేశాం అనుకుంటారు.
ఇప్పుడు మన హీరోల్లో కూడా మార్పు వస్తుంది. ప్రమోషన్ కి ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నారు. అయితే.. బాలీవుడ్ హీరోల్లా జనాల్లోకి వెళ్లడం కాకుండా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే వార్తల్లో ఉంటున్నారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ మూవీ షూటింగ్ లో కీర్తి సురేష్ కునుకు తీస్తుంటే.. హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆమెకు తెలియకుండా వెనకాలనుంచి సెల్పీ దిగారు. ఆతర్వాత ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆటపట్టించారు. ఆతర్వాత అసలు విషయం తెలుసుకున్న కీర్తి.. షూటింగ్ సెట్ లో ఎప్పుడూ పడుకోకూడదు అని తెలుసుకున్నాను. అయితే.. తనకు తెలియకుండానే ఫోటో తీసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో నితిన్ పై ప్రతీకారం తీర్చుకుంటాను అని మంగమ్మశపథంలా మహానటి శపథం చేసింది. ఆమె అన్నంత పని చేసింది.
గొడుగు పట్టుకుని డైరెక్టర్ వెంకీని పరెగెట్టించి పెరిగెట్టించి మరీ.. కొట్టింది. ఒక నితిన్ మిగిలాడు.. నితిన్ పై కూడా పగ తీర్చుకుంటాను అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇలా.. కీర్తి సెట్ లో పడుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడం.. ఆతర్వాత కీర్తి డైరెక్టర్ ని కొట్టడం… ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో రకం పబ్లిసిటీ. నితిన్ టీమ్ ప్లాన్ అదిరింది. కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. మరి.. సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న రంగ్ దే ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Must Read ;- టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ?