పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంటుంది కానీ.. పెళ్లి ఎప్పుడు.? ఎవరితో.? అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే అంటూ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓసారి అయితే.. ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్త చూసి చాలా మంది నిజమేనా అని ఆరా తీయడం మొదలుపెట్టడంతో.. ఏకంగా ప్రభాస్, అనుష్క.. అలాంటిది ఏమీ లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఆ వార్తల పై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజుని అడిగితే.. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని చెప్పారు. అయితే.. బాహుబలి సినిమా పూర్తి కావడం.. రిలీజ్ కావడం కూడా జరిగింది కానీ.. ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. అయితే.. ఏమనున్నారో ఏమో కానీ.. కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే.. జరగాల్సిన టైమ్ వచ్చినప్పుడే అదే జరుగుతుందని చెప్పి సైలెంట్ అయిపోయారు.
ఇదిలా ఉంటే… ఇప్పుడు మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కృష్ణంరాజు భార్య తరుపు బంధువుల ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసారని.. ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. వీళ్లకు అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలు, వేరే వ్యాపారాలు ఉన్నాయని వీళ్ల సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా అని సమాచారం. ఈసారి నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందని గట్టిగా వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ప్రభాస్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Must Read ;- ప్రభాస్ తల్లి పాత్ర గొప్పగా ఉంటుందన్న భాగ్యశ్రీ











