బిగ్ బాస్ ఫైనల్ పై రోజురోజుకు మరింత ఆసక్తి పెరగడంతో పాటు వీక్షకుల్లో విజేతగా ఎవరు నిలుస్తారో అనే ఉత్కంఠ పెరుగుతుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ తో ఫైనల్ లో చేరిన వాళ్లు ఎవరో తెలిసిపోయింది. ఫైనల్ కి చేరిన అఖిల్, అభిజిత్, సోహెల్, హారిక, అరియానా.. ఈ ఐదుగురులో ఎవరు విజేతగా నిలుస్తారో అని ఫైనల్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎవరికి తోచినట్టుగా వాళ్లు తమ అభిమాన కంటెస్టంట్ కి మద్దుతు తెలియచేస్తూ.. ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ సందడి మామూలుగా లేదు.
బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కోసం తమ ఫేవరేట్ కంటెస్టంట్ కి సపోర్ట్ చేయడానికి సినీ తారలు సైతం రంగంలోకి దిగారు. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరియానాకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె విన్నర్ అవ్వడానికి అర్హురాలు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇక హీరో శ్రీకాంత్ అయితే.. తన ఫేవరేట్ కంటెస్టంట్ అభిజిత్. చాలా స్ట్రాంగ్ కంటెస్టంట్. అతనే విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ, హీరో శ్రీకాంతే అనుకుంటే.. ఇప్పుడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా రంగంలోకి దిగాడు.
ఇంతకీ విజయ్ సపోర్ట్ ఎవరికంటే… అభిజిత్ కి. విజయ్ దేవరకొండ అభిజిత్ కి సపోర్ట్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అది ఏంటంటే… విజయ్, అభిజిత్ కలిసి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో నటించారు. ఇంతకీ.. సోషల్ మీడియాలో విజయ్ ఏమన్నాడంటే.. తన స్నేహితుడు అభిజిత్‌కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో విజయ్, అభిజిత్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సుధాకర్, నవీన్ పోలిశెట్టి ఉన్నారు. మై బాయ్స్.. ఎల్లప్పుడూ వారికి మంచే జరగాలి.. ఎక్కడైనా.. ఏమైనా అంటూ కామెంట్ పెట్టాడు. ఈ విధంగా అభిజిత్ విన్నర్ అవ్వాలనుకుంటున్నానని తన మనసులో మాట చెప్పకనే చెప్పాడు విజయ్. మరి.. ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటారో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత ఎవరో బయటపెట్టిన అవినాశ్..