సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగుళూరు భామ అనుష్క. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న అనుష్క అనతి కాలంలోనే తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పచ్చు. కెరీర్ బిగినింగ్ లో కమర్షియల్ సినిమాల్లో నటించింది. అయితే.. ఎప్పుడైతే.. అరుంధతి సినిమాలో అనుష్క నటించిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ ను మలుపు తిరిగిందని చెప్పచ్చు. అరుంథతి సినిమా తర్వాత నుంచి ఎవరైనా లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే.. వాళ్ల ఛాయిస్ అనుష్కనే అయ్యింది. బాహుబలి, రుద్రమదేవి, భాగమతి చిత్రాల్లో పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా నటించి మెప్పించింది.

అసలు విషయానికి వస్తే.. అనుష్కకు దైవభక్తి ఎక్కువే. ఏమాత్రం అవకాశం లభించినా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పుణ్యక్రేత్రాలకు వెళుతుంటుంది. నిన్న అనుష్క గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలు చేసారని తెలిసింది. మంగుళూరు నుంచి రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి మరబోటులో గోదావరి మధ్యలో ఉన్న నందీశ్వరుని ఆలయాన్ని దర్శించికుంది. తిరిగి అదే బోటులో వెనకక్కి వచ్చారట. ఇలా.. అనుష్క గోదావరి మధ్యలో ఉన్న నందీశ్వరుని ఆలయానికి వెళ్లి పూజలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
ఇంతకీ.. అనుష్క ఎందుకు ఇంత సడన్ గా ప్రత్యేక పూజలు చేసిందంటే.. ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. గతంలో షూటింగ్ కి వెళ్లినప్పుడు ఆలయాన్ని చూడడం జరిగింది కానీ.. పూజలు చేయించే అవకాశం లభించలేదు. ఇప్పుడు టైమ్ కుదరడంతో వెళ్లి దర్శించుకున్నాను. కార్తీకమాసంలో గోదావరి మధ్యలో ఉన్న ఆ ఆలయంలో పూజలు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అంతే తప్పా ప్రత్యేక కారణం ఏమీ లేదని చెప్పింది. ఇటీవల అనుష్క నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. త్వరలో తను నటించబోయే సినిమాను ప్రకటించనున్నట్టు సమాచారం.
Must Read ;- సింహాచలంలో ఆ దర్శకుడి ప్రత్యేక పూజలు… ఎందుకు?











