June 3, 2026 3:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

తెలుగు తెర యశస్వీ .. కళా తపస్వీ (కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్)

ఆదుర్తివారి స్కూల్ కావడంతో, బలమైన కథతోనే విశ్వనాథ్ బరిలోకి దిగేవారు. పాత్రలను తీర్చిదిద్దడంలో తనదైన ప్రత్యేకతను కనబరిచారు...

February 19, 2021 at 1:01 AM
in Tollywood
కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్

కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్

Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు తెరను ఆయన ప్రేమించాడు .. తెలుగు కథను ఆయన నడిపించాడు ..  తెలుగు సినిమాను ఆయన గెలిపించాడు. తెలుగు తెరపై కళాత్మకమైన కథలకు ఆయనే నాయకుడు .. నావికుడు. తెలుగు కథకు సంగీత సాహిత్య నృత్యాలను నేర్పిన సేవకుడు .. ప్రేక్షకుల హృదయ సామ్రాజ్యం వరకూ ముందుండి నడిపించిన సైనికుడు .. కె.విశ్వనాథ్ .. ఈ రోజున ఆయన పుట్టినరోజు.

విశ్వనాథ్ పూర్తి పేరు .. కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు జిల్లా ‘పెదపులివర్రు’ గ్రామంలో ఆయన జన్మించారు.గుంటూరులోనే కళాశాల విద్యను అభ్యసించిన ఆయన, ఆ తరువాత సినిమాలపట్ల గల ఆసక్తితో చెన్నైకి చేరుకున్నారు. అక్కడ ఓ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా చేరిన ఆయన, దర్శకత్వ విభాగంలో చేరే అవకాశం కోసం ఎదురుచూస్తూ రోజులు నెట్టుకు రాసాగారు. ఆ సమయంలోనే ఆయనకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన ఆదుర్తివారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ అనుభవాన్ని సంపాదించారు.

అప్పట్లో ఆదుర్తి సుబ్బారావుగారు .. అక్కినేని నాగేశ్వరరావుతో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఉండేవారు. దాంతో విశ్వనాథ్ కి అక్కినేనితో సాన్నిహిత్యం ఏర్పడింది .. విశ్వనాథ్ ప్రతిభా పాటవాలను అక్కినేని దగ్గరగా చూసే అవకాశం లభించింది. దాంతో అక్కినేనిని దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ్ ఒక కథను సిద్ధం చేసి వినిపించడం .. ఆ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అలా విశ్వనాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన చిత్రమే ‘ఆత్మ గౌరవం’. 60వ దశకంలో వచ్చిన ఈ సినిమా .. విజయంతో పాటు విశ్వనాథ్ కి రాష్ట్రప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

ఇక ఆ తరువాత దర్శకుడిగా విశ్వనాథ్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆదుర్తివారి స్కూల్ కావడంతో, బలమైన కథతోనే విశ్వనాథ్ బరిలోకి దిగేవారు. పాత్రలను తీర్చిదిద్దడంలో తనదైన ప్రత్యేకతను కనబరిచారు. 70వ దశకంలో ‘చెల్లెలి కాపురం’ .. ‘కాలం మారింది’ .. ‘శారద’ .. ‘ఓ సీతకథ’ .. ‘జీవన జ్యోతి’ వంటి వైవిధ్యభరితమైన కథలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, విశేషమైన ఆదరణను .. విజయాలను కలిపి అందుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన ‘సిరి సిరి మువ్వ’ సినిమా ఓ సంచలనమే సృష్టించింది. ఒక బలమైన కథ .. ప్రేక్షకుడిని తనలోకి ఎంత బలంగా ఐక్యం చేసుకుంటుందనేది ఈ సినిమా నిరూపించింది.

‘సీతామాలక్ష్మీ’ సక్సెస్ తరువాత విశ్వనాథ్ చేసిన ‘శంకరాభరణం‘ .. దర్శకుడిగా ఆయన విశ్వరూపాన్ని ఆవిష్కరించింది.  అప్పటికి ఎలాంటి గుర్తింపులేని సోమయాజులును ప్రధానమైన పాత్రకి తీసుకుని ఆయన ఓ ప్రయోగమే చేశారు .. అందరూ ఆశ్చర్యపోయే సాహసమే చేశారు. సంగీత ప్రధానమైన ఒక సినిమాకి ప్రేక్షకులను రప్పించడంలో .. మెప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఈ రోజుకీ ఈ సినిమా ఒక అద్భుతమే .. అంతరంగ సంద్రాన దాచుకునే ఆణిముత్యమే.

‘శంకరాభరణం’ తరువాత .. అంటే 80వ దశకంలో, విశ్వనాథ్ సినిమాలు సకారంతో మొదలుకావడమనేది ఒక సెంటిమెంట్ గా మారింది. సంగీత .. సాహిత్య .. నృత్యాలు ఆయన కథలను పెనవేసుకుపోయాయి. సామాజిక పరమైన సందేశాలు ఆ కథల్లో అల్లుకుపోయాయి. వరుస విజయాలతో ఈ దశకం నాది అని విశ్వనాథ్ నిరూపించారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సమయాన్ని ఒక స్వర్ణయుగంగానే చెప్పుకున్నారు. అలా ఈ దశకంలో వచ్చిన చిత్రాల జాబితాలో ‘సాగర సంగమం’ .. ‘స్వాతిముత్యం’ .. ‘సిరివెన్నెల’ .. ‘శ్రుతిలయలు’ .. ‘స్వర్ణకమలం’ .. ‘స్వయంకృషి‘ .. ‘సూత్రధారులు’ కనిపిస్తాయి.

90వ దశకంలోనూ ఆయన ‘స్వాతికిరణం’ .. ‘శుభసంకల్పం‘ వంటి గొప్ప చిత్రాలను ప్రేక్షకుల మనసు తెరపై ఆవిష్కరించారు. తనదైన మార్కు కథలతో ప్రశంసలు అందుకున్నారు. విశ్వనాథ్ కథా వస్తువును ఎంచుకునే తీరు .. దానిని నడిపించే విధానం ఎంతో అద్భుతంగా ఉండేది. ప్రతి సన్నివేశంలోను నటించి చూపించడం ఆయన ప్రత్యేకత. లోతైన మాటలకు .. పరిమళించే పాటలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఆయన సినిమాల్లో చాలావరకూ ‘ప్రేమతో ముడిపడిన మనసులు .. కళతో కలిసి నడిచే జీవితాలు’ అనే కాన్సెప్టుతోనే కొనసాగాయి. ప్రేమకీ .. పెళ్లికి ఆ రెండింటితో అనుసంధానం చేయబడిన ‘కళ’కు పవిత్రమైన అర్థాలు చెప్పాయి.

విశ్వనాథ్ తాను చేస్తున్నది దర్శకత్వమని కాకుండా ఒక తపస్సు చేస్తున్నట్టుగా భావించేవారు. అందువల్లనే కళాత్మక చిత్రాలను కమర్షియల్ హిట్లుగా నిలబెట్టగలిగారు. తెలుగులో ఆణిముత్యాలవంటి సినిమాలను ..  విశిష్టమైన చిత్రాలను ఏరుకునే ప్రయత్నం చేస్తే, ముందుగా చేతికి తగిలేది విశ్వనాథ్ వారి సినిమాలే. ఆయన సినిమాల ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా వైభవాన్ని చెప్పడం సాధ్యం కాదు. దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా ఆయన తన స్థాయికి తగిన పాత్రలను పోషించారు .. హుందాతనంతో కూడిన నటనతో మెప్పించారు.

తెలుగు సినిమాకి విశ్వనాథ్ గౌరవాన్ని తెచ్చారు .. వైభవాన్ని పెంచారు .. కథను కళను మేళవించి అపురూప దృశ్యకావ్యాలను ఆవిష్కరించారు. సహజత్వంతో కూడిన కథాకథనాలతో సహజ సుగంధాలను వెదజల్లారు. ఆయన చేసిన సేవకిగాను పద్మశ్రీ .. దాదాసాహెబ్ ఫాల్కే .. రఘుపతి వెంకయ్య పురస్కారాలు పలకరించాయి .. పులకరించాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ కళా ప్రవాహానికి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.

— పెద్దింటి గోపీకృష్ణ

Must Read ;- తన సినిమాని తానే కాపీ కొట్టిన విశ్వనాథ్

Tags: k viswanath best moviesk viswanath best songsk viswanath biographyk viswanath biopick viswanath date of birthk viswanath daughterk viswanath directed telugu movies listk viswanath direction songsk viswanath director telugu songsk viswanath family photosk.viswanath agek.viswanath directed moviesk.viswanath directork.viswanath familyk.viswanath film listk.viswanath filmsk.viswanath house addressk.viswanath moviesk.viswanath songsk.viswanath telugu movies listk.viswanath telugu songslatest movie newsLatest Telugu Newsleotoptelugu newstollywood legendary director k viswanath birthday specialtollywood legendary director k.viswanathTollywood moviesviswanath birthdayviswanath birthday special
Previous Post

నటుడు మోహన్ బాబు కు భారీ జరిమానా విధించిన జీ.హెచ్.యంసీ

Next Post

దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంప‌ల్లికి మూడిన‌ట్టేనా?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Shivani Narayanan very beautiful and spicy photos gallery

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Janhvi Kapoor looking hot in Saree

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist