2020 సంవత్సరానికి కోవిడ్ 19 పట్టి పీడించిన సంగతి తెలిసిందే. అన్ని రంగాలు దీని దెబ్బకు కుదేలయ్యాయి. సినీ రంగం కూడా దీని వల్ల అనేక ఇబ్బందులు పడింది. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మాత్రం కరోనా కారణంగా భలేగా బాగుపడ్డాయి. థియేటర్స్ లేని కారణంగా వినోదాన్ని మిస్సైన జనం.. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో వెబ్ సిరీస్ ను, సినిమాల్ని బాగా ఆస్వాదించారు. అందులో పలు చిత్రాలు, కొన్ని వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో బ్రహ్మాండమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.
సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఆన్ లైన్ డేటాబేస్ సంస్థ అయిన ఐ.యమ్.డీ.బీ టాప్ 10 వెబ్ సిరీస్ జాబితాను విడుదల చేసింది. అన్ని జానర్స్ కు చెందిన ఈ పది వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐ.యమ్.డీ.బీ రేటింగ్స్ ను బట్టి.. ఈ వెబ్ సిరీస్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
1.స్కామ్ 1992 : ది హర్షద్ మెహతా స్టోరీ
2020 సంవత్సరానికే హైయస్ట్ పాపులారిటీని తెచ్చుకున్న వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. ఎయిటీస్ కాలానికి చెందిన కథతో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. స్టాక్ మార్కెట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథతో ఈ సిరీస్ రూపొందింది. ప్రతీక్ గాంధి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, హేమంత్ ఖేర్ , నిఖిల్ ద్వివేది ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కు హన్సల్ మెహతా, జై మెహతా సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 9 నుంచి సోనీ లైవ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది ఈ వెబ్ సిరీస్.
2.పంచాయత్
జితేంద్ర కుమార్ , రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ టెలివిజన్ సిరీస్ అండ్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కు చందన్ కుమార్ కథ అందించాడు. ఒక పెద్ద సిటీకి చెందిన ఒక యంగ్ గ్రాడ్యుయేట్ అతి తక్కువ శాలరీతో ఫులేరా అనే పల్లెటూరి లోని పంచాయతీ ఆఫీస్ లో ఉద్యోగానికి చేరతాడు. అప్పుడు అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కామెడీ జోనర్ లో చక్కటి ఎమోషన్స్ తో కథాకథనాలు సాగుతాయి. ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది ఈ వెబ్ సిరీస్.
Must Read ;- ‘మహర్షి’ దర్శకుడి వెబ్ సిరీస్ ఎప్పటినుంచి?
3.స్పెషల్ ఆప్స్
రేవతి పిళ్ళై , కే.కే.మీనన్, కరణ్ టక్కర్, విపుల్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ సిరీస్ ‘స్పెషల్ ఆప్స్’. నీరజ్ పాండే, శివమ్ నాయర్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. రా ఏజెంట్ అయిన హిమ్మత్ సింగ్ .. రకరకాల టెర్రిరిస్ట్ ఎటాక్స్ గురించి ఇన్వెస్ట్ గేట్ చేసి .. వీటి వెనుక ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుసుకుంటాడు. అతడ్ని పట్టుకోడానికి వివిధ ప్రాంతల్లో ఐదుగురు ఏజెంట్స్ నియమింపబడతారు. చివరికి ఆ వ్యక్తిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు? అన్నదే మిగతాకథ. రెండు దశాబ్దాల కాలంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ మీద ఎంతో పరిశోధన జరిపి ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇందులోని సన్నివేశాలు .. టేకింగ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
4.బంధిష్ బాండిట్స్
శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే రాధే, పాప్ సంచలనం అయిన తమన్నా.. ఒకాకొక సందర్భంలో ఒకరినొకరు తారాసపడతారు. ఆ ప్రయాణంలో ఒకరికొకరు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. చివరికి ఆ ఇద్దరి సంగీత ప్రయాణం ఎక్కడికి దారి తీసింది? అన్నదే మిగతా కథ. రిత్విక్ భౌమిక్ , శ్రేయా చౌదరి , నసిరుద్దీన్ షా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ కు ఆనంద్ తివారీ దర్శకుడు. శంకర్ ఎహెసాన్ లాయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సీరిస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
Also Read ;- నెట్ ఫ్లిక్స్ లోని ఓ వెబ్ సిరీస్ కు అరుదైన గౌరవం.. !
5.మీర్జాపూర్
ఈ ఏడాది ఓటీటీల్లో విడుదలైన వెబ్ సిరీస్ లో ఎక్కువ మంది ప్రేక్షకుల మనసు దోచిన మరో సిరీస్ ‘మీర్జాపూర్’. ఆలీ ఫజల్ , పంకజ్ కపూర్, శ్వేతా త్రిపాఠీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకులు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ ముఖ్యంగా డ్రగ్స్, గన్స్ , మర్డర్స్ మీద సాగుతుంది. మొదటి సీజన్ బాగా క్రేజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు రెండో సీజన్ కూడా మొదలైంది. మొదటి సీజన్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేశాయి. ఇక మీర్జాపూర్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కు కూడా బాగా పేరొచ్చింది. సెకండ్ సీజన్ కూడా తెలుగులో విడుదల కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.
6.అసుర్ : వెల్ కమ్ టుది డార్క్ సైడ్
వారణాసి బ్యాక్ డ్రాప్ లో సాగే .. మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ అసుర్. అర్షద్ వార్సి, బరున్ సోబ్తి, అనుప్రియ గోయంకా ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కు ఒనీ సేన్ దర్శకుడు. సిబిఐ లో పోరెన్సిక్ వింగ్ లో పనిచేస్తోన్న నిఖిల్ నాయర్ అనే ఒక యువకుడు.. తన బాస్ ధనుంజయ్ రాజ్ పుత్ తో ఓ సీరియల్ కిల్లర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. చివరికి ఆ ఇద్దరూ అతడ్ని ఏ ఎలా పట్టుకున్నారు అన్నదే కథ. ఆ హంతకుడు చేసే హత్యలన్నీ పురాణాల్ని బేస్ చేసుకొని సాగుతాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయింది. వూట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది ఈ వెబ్ సిరీస్.
7.పాతాళ్ లోక్ :
జైదీప్ అహల్వత్, గుల్ పనాగ్, నీరజ్ కబీ, స్వస్తికా ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన మరో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘పాతాళ్ లోక్’. తరుణ్ తేజ్ పాల్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ దీనికి దర్శకులు. ఒక హంతకుడి కోసం గాలిస్తోన్న ఒక పోలీస్ ఆఫీసర్ కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అడుగడగునా ఉత్కంఠతో సాగే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు భలేగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
8.హై
అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘హై’. మత్తుమందులకు బానిసగా మారిన ఒక యువకుడు చివరికి రిహెబిలిటీ సెంటర్ కు వెళతాడు. యమ్. ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది.
9.అభయ్
కునాల్ కేము, సందీప ధర్, ఎల్నాజ్ నరౌజీ ముఖ్యపాత్రలు పోషించిన థ్రిల్లర్ సిరీస్ అభయ్. జీ 5 ఒరిజినల్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు కెన్ ఘోష్. చింతరి అనే గ్రామానికి చెందిన రఘు, పూజా అనే ఇద్దరు స్కూల్ విద్యార్ధులు మిస్ అవుతారు. ఆ కేస్ ను ఇన్వెస్ట్ గేట్ చేయడానికి బరిలోకి దిగుతాడు పోలీసాఫీసర్ అభయ్. రెండేళ్ళుగా అదే ఏరియాలోని విద్యార్ధులు మిస్ అవుతుంటారు. ఆ కేస్ మిస్టరీని అభయ్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే సిరీస్ కథాంశం. అడుగడుగనా ఉత్కంఠభరితంగా సాగే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది.
Also Read ;- వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్న దబాంగ్ బ్యూటీ
10.ఆర్య
చాలా ఏళ్ళ తర్వాత విశ్వసుందరి సుస్మితా సేన్ నటించిన వెబ్ సిరీస్ ఆర్య . ఆమె తన కమ్ బ్యాక్ తోనే అందరినీ మెప్పించింది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ థ్రిల్లర్ డ్రామా అందరినీ ఆకట్టుకుంటోంది. డచ్ డ్రామా పెనోజా ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రామ్ మధ్వానీ, సందీప్ మోడి, వినోద్ రావత్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది.