బిగ్ బాస్ 4 ఫైనల్ కి అంతా రెడీ అయ్యింది. అయితే.. విన్నర్ ఎవరు.? రన్నర్ ఎవరు.? 5 గురులో ముందుగా ఎవరు ఎలిమినేట్ అవుతారు.? అనేది ఆసక్తిగా మారింది. దీనికి ఎవరు తోచిన విధంగా వాళ్లు ఊహించుకుంటున్నారు. సోషల్ మీడియాలో విన్నర్ ఎవరు అంటే.. అభిజితే అంటున్నారు. కొంత మంది అయితే.. గత మూడు సీజన్ లలో అబ్బాయిలే విన్నర్ గా నిలిచారు కాబట్టి.. ఈసారి అమ్మాయి విన్నర్ గా నిలుస్తుంది. ఆ లెక్కన అరియానా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఫైనల్ లో ఉన్న అఖిల్ విన్నర్ నేనే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సోహెల్ ఇక్కడ వరకు రావడమే లక్ గా భావిస్తున్నాను. విన్నర్ కాకపోయినా ఫరవాలేదు అంటున్నారు. అరియానా కూడా కెరీర్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలే అయ్యింది. ఈ నాలుగేళ్లలో బిగ్ బాస్ వరకు రావడం అంటే మాటలు కాదు. ఇది చాలు అన్నట్టుగా ఆమె కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది. హారిక కూడా సంతృప్తిగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఫైనల్ లో ఉన్న తమ ఫేవరేట్ కంటెస్టంట్ ల కోసం కొంత మంది సినీ తారలు కూడా రంగంలోకి దిగారు.
దీంతో విన్నర్ ఎవరు అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే.. మాకు అందిన సమాచారం ప్రకారం విన్నర్, రన్నర్ అండ్ లిస్ట్ ఇలా ఉంది. టాప్ 5లో హారిక టాప్ 4లో అఖిల్, టాప్ 3లో అరియానా, టాప్ 2 లో సోహెల్, టాప్ 1 విన్నర్ అభిజిత్ అని తెలిసింది. చిరంజీవి, నాగచైతన్య, సాయిపల్లవి గెస్ట్ లు కాగా, లక్ష్మీరాయ్, మెహ్రీన్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేయనున్నారు. మరో విషయం ఏంటంటే.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ లైవ్ మ్యూజిక్ స్టేజ్ పర్ ఫార్మెన్స్ ఉంటుంద. ఈ లెక్కన ఫైనల్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మరి.. టీఆర్పీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also Read: బిగ్ బాస్ 4 ఫైనల్ గెస్ట్ ఎవరు.?