తలాక్.. తలాక్.. తలాక్.. ఈ మూడు ముక్కలు ఎందరో మహిళల జీవితాల్ని ప్రశ్నార్ధకం చేశాయి. మహిళలంతా ఒక్కటై త్రిపుల్ తలాక్ ని వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తారు. దాని ఫలితమే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. త్రిపుల్ తలాక్ చెల్లదంటూ పార్లమెంట్ చట్టం చేశారు. ఇంత చేసినా లాభం మాత్రం అరకొరగానే ఉన్నట్లుంది. ఇప్పటికీ త్రిపుల్ కేసులు నమోదు కావడమే అందుకు నిదర్శనం. తాజాగా అలాంటి కేసు హైదరాబాద్ లో నమోదు అయింది. ఫోన్ లో త్రిపుల్ తలాక్ చెప్పడంతో కంగారు పడిన యువతి మంత్రిని ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుంది.
చదువు పేరుతో మోసం
సొమాలియా దేశస్థుడైన అహ్మద్ చదువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అతనికి అమెరికా సిటిజన్ షిప్ కూడా ఉంది. 2015 లో పాతబస్తీకి చెందిన ఫాతిమా అనే యువతిని వివాహాం చేసుకుని అమెరికా తీసుకుళ్తానని నమ్మబలికాడు. అప్పటి ఆమెను తీసుకెళ్లకుండా కాలయాపన చేస్తున్నాడు. అహ్మద్ వస్తూ పోతూ ఉండడంతో వారికి కూడా అనుమానం రాలేదు. హఠాత్తుగా రెండు నెలల క్రితం ఫాతిమా తండ్రికి ఫోన్ చేసి విడాకులు ఇస్తున్నట్లు చెప్పాడు. ఫాతమాకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పి ఇక మనిద్దరికి సంబంధం లేదంటూ మాట్లాడడంతో ఆమె షాకైంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరింది.
Must Read ;- ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రియుడు
స్పందించని ప్రభుత్వం
రెండు నెలలు గడుస్తున్నా అహ్మద్ ను భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఫాతిమా కేంద్ర విదేశాంగ మంత్రత్వ శాఖను కలిసి ఫిర్యాదు చేసింది. చదువుపేరుతో భారత్ కు వచ్చి అమాయకులైన ఆడపిల్లలను ఇలా మోసం చేస్తున్నారని, తల్లిదండ్రులు, ఆడపిల్లలు విదేశీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారి పేర్కోన్నారు. వివాహానికి ముందు విదేశీయుల గురించి తరవుగా విచారించుకుని మాత్రమే ముందడుగు వేయాలని కోరారు. అందుకోసం అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని పేర్కోన్నారు. అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి కేసులు తగ్గుతాయని తెలియజేశారు.
ఏదీ అవగాహానా?
ఇదేం కొత్త కేసు కాదు. గుడ్డిగా నమ్మకండి అంటూ ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నా కూడా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రభుత్వాలను నిందించడం వల్ల ఉపయోగం ఉండదు. విదేశంలో ఉంటున్న వ్యక్తులను భారత్ కు రప్పించి నేరం నిరూపించి శిక్ష పడేలా చేయడం అనేది సాధారణ విషయం కాదు. అందువల్ల అప్రమత్తంగా ఉండడం మాత్రమే ఇలాంటి వాటిని ఆపగలదనే విషయం మర్చిపోకూడదు.
Also Read ;- ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ముస్లిం మతపెద్ద సెల్ఫీ వీడియో