పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారు .. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. సిన్సియర్ పోలీసాఫీసర్ గా పవర్ స్టార్, మిలటరీ హవల్దార్ గా రానా నటిస్తోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం స్ర్కిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేపడుతున్నారు మేకర్స్.
అయితే ఆ స్ర్కిప్ట్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా పక్కా గా మార్చే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించారు మేకర్స్. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నా.. నేటి సాయంత్రం చిత్ర నిర్మాతలు ఆ విషయాన్ని అఫీషియల్ గా వీడియో రూపంలో తెలియచేసి.. త్రివిక్రమ్ కు వెల్ కమ్ చెప్పారు .
సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారు నిర్మిస్తోన్న 12వ సినిమా గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాకి బిల్లారంగా అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవడంతో .. రీసెంట్ గా పవర్ స్టార్ క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ గెటప్ కోసం పవర్ స్టార్ డిఫరెంట్ గా మేకోవర్ అవుతున్నారని సమాచారం. గతంలో తీన్ మార్ సినిమా కోసం స్ర్కిప్ట్ వర్క్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు మరోసారి తన పెన్ పవర్ చూపించడానికి రెడీ అవుతుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మరి ఈ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు ఏ రేంజ్ లో హైలైట్ కానున్నాయో చూడాలి.
Sithara Entertainments heartily welcomes Celluloid Magician #Trivikram garu to #PSPKRanaMovie family!
Shoot commences from 22nd January 2021! @PawanKalyan @RanaDaggubati @MusicThaman @saagar_chandrak @vamsi84 @sitharaents pic.twitter.com/48pQNpUpX7
— BA Raju's Team (@baraju_SuperHit) January 15, 2021











