‘సడక్-2′ ఫలితం ‘త్రిపులార్’ బృందానికి చెమటలు పట్టిస్తోంది. సుశాంక్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు ఆలియాభట్ పరోక్షంగా కారణంగా నిలిచిందనే అనుమానంతో.. ఆలియా నటించిన ‘సడక్-2’ చిత్రం ట్రైలర్ కి కోట్లాది మంది ‘డిస్ లైక్స్’ కొట్టడంతో… ఆ చిత్రం ప్రపంచంలోనే ‘మోస్ట్ డిస్ లైక్డ్’ ట్రైలర్ గా నిలిచింది. అయినాసరే ధైర్యం చేసి, ఆ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఎంత కసితో, కోపంతో ‘సడక్-2’ను డిస్ లైక్ చేశారో… అంతకు మించిన కోపంతో ఈ చిత్రానికి అత్యంత దారుణమైన రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ రేటింగ్ పొందిన ‘చెత్త చిత్రం’గా ‘సడక్-2’ నిలిచింది. దీంతో ఆలియా భట్ నటిస్తున్న ఇతర చిత్రాల నిర్మాతలు, దర్శకులు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా 500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి ఈ విపరిణామంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో డేట్స్ వంకతో… ఈ చిత్రం నుంచి ఆలియాను తప్పించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే… ఆలియాకు ఇప్పటికే చెల్లించిన రెమ్యూనరేషన్ నష్టపోవడంతోపాటు… ఇప్పటికే తీసిన సీన్స్ ను పక్కన పెట్టి.. .ఆ సన్నివేశాలను అన్నీ ఫ్రెష్ గా తీసేందుకుగాను.. ‘ఆర్.ఆర్.ఆర్’ బృందం హీన పక్షంలో మరో పది పదిహేను కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల భోగట్టా!!