గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేసింది. బలవంతం చేసి పాఠశాలల బస్సులు వాడుకుంటున్నారని తెలిపారు. డిగ్రీలేని వారిని, నకిలీ ఓటర్లు ఫోలింగ్ చేయకుండా అరికట్టాలని కోరారు. తమ ఫిర్యాదులపై సీఈవో సానుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ తెలిపారు.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్