నేచురల్ స్టార్ నానీ.. రీసెంట్ గా ‘వి’ సినిమాతో చేదు అనుభవాన్ని చవిచూశాడు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ విషయాన్ని ఏమంత సీరియస్ గా తీసుకోకుండా.. తదుపరి సినిమాల విషయంలో కాస్తంత కేర్ఫుల్ గా అడుగులేయబోతున్నాడు. ‘వి’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ‘టక్ జగదీష్’ సినిమాను ప్రారంభించాడు నానీ. కానీ ఆ సినిమా చిత్రీకరణకు కరోనా వైరస్ బ్రేకులేసింది.
ఎట్టకేలకు ఏడునెలల అనంతరం ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభమయింది. నానీ హీరోగా ‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీని తెరకెక్కించి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇంతకు ముందు శివ.. నాగచైతన్య, సమంతలతో మజిలీ సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవుతున్నట్టు .. నానీ ట్విట్టర్ లో తెలియచేశాడు. మాస్క్ తో నుంచొని ఎటో చూస్తున్నట్టు బ్యాక్ పోజ్ ను ఈ సందర్భంగా నానీ పోస్ట్ చేశాడు. జగపతి బాబు మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ‘టక్ జగదీష్’ నానీ కెరీర్ ను ఏరేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.
Jagadish joins
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH— Nani (@NameisNani) October 7, 2020











