జగన్ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన రోడ్డెక్కడం వైసీపీ నేతల చా*వుకొస్తోంది. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదు. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ను పరామర్శించడానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్లారు వైఎస్ జగన్. మధ్యాహ్నం బయల్దేరిన జగన్ సాయంత్రం వరకు ఊరేగుతూ నాలుగు గంటలు ఆలస్యంగా జోగి రమేశ్ నివాసానికి చేరుకున్నారు. ఉదయం నుంచి జోగి రమేశ్ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ నేత రాంబాబు.. పల్స్ పడిపోయి.. ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. ఉన్న చోటునే కుప్పకూలిన రాంబాబును.. వైసీపీ కార్యకర్తలు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మ*రణించారని వైద్యులు ధృవీకరించారు.
జగన్ పర్యటన కోసం వైసీపీ కార్యకర్తలు హడావుడి చేయడం మామూలే. ఇబ్రహీంపట్నంలోనూ ఇదే విధంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ నాయకులతో వచ్చిన ఒక యువకుడు బైక్ మీద స్టంట్లు చేస్తూ రోడ్డు మీదున్న బార్ గేట్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృ*తి చెందాడు. ఇతను ఇబ్రహీంపట్నం కొత్తగేట్ ప్రాంతానికి చెందిన భార్గవ్ అని తెలుస్తోంది. జగన్ పర్యటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మ*రణించడం విషాదకరం. అయితే ఫ్యాన్ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీగా జనసమీకరణ చేసి రోడ్డు మీద నానా హంగామా చేశారు. బైక్ స్టంట్‌లతో రచ్చ రచ్చ చేశారు. ఈ అల్లరి మూకను కట్టడి చేయడానికి వైసీపీ నేతలెవరూ ప్రయత్నించలేదు.
ఒక్క ఇబ్రహీంపట్నంలోనే కాదు.. సత్తెనపల్లిలో బెట్టింగ్ అప్పులు తీర్చలేక ఆ*త్మహ*త్య చేసుకున్న వైసీపీ నేత విగ్రహాన్ని ఆవిష్కరించడానికి.. వైఎస్ జగన్.. గుంటూరు మీదుగా వెళ్లారు. ఆ సమయంలో గుంటూరుకు చెందిన దళిత వృద్ధుడు సింగయ్య జగన్ కారు కింద పడి మ*రణించారు. వయసు మళ్లిన వ్యక్తి కారు కింద పడితే ఆసుపత్రిలో చేర్చాలన్న కనీస మానవత్వం కూడా చూపించకుండా.. అతన్ని రోడ్డు పక్కన పడేసిన వైసీపీ బ్యాచ్.. జగన్ కాన్వాయ్‌తో ముందుకు సాగిపోయింది. రాజకీయ నాయకులు రోడ్డెక్కితే ప్రజలకు మేలు జరగాలి. కానీ సొంత పార్టీ కార్యకర్తలనే బ*లి తీసుకొనేలా సాగుతున్న జగన్ యాత్రలు జనాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఇకనైనా వైసీపీ నాయకులు తమ బల ప్రదర్శనల మీద కాకుండా ప్రజల బాగోగుల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని సామాన్యులు కోరుకొంటున్నారు.











