మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్‌ను ఉద్దేశించించి సంచలన కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లనే జగన్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుందని, భారీ మెజార్టీతో గెలుపొందిన జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జైలేమైనా నీకు కొత్తా.. మరి దేనికి భయపడుతున్నవ్ అంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడుగు వేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తప్పుగానే భావిస్తారని, ప్రజా మద్దతు గెలిచిన మీరూ.. ప్రజల వెంట ఉంటారా.. మోదీ, అమిత్ షా మాటలు వింటారా అనేది ముందుగా తేల్చుకోవాలని అన్నారు. త్వరలోనే జగన్ పై జనం తిరగబడే రోజులు వస్తాయని ఉండవల్లి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గళం.. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు...