మాజీ ఎంపీ ఉండవల్లి తీరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. స్కిల్ స్కాం పై సీబీఐ విచారణ కోరుతూ ఉండవల్లి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు 44 మందికి నోటీసులు జారీ చేస్తూ కేసు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు చేసిందేమీ లేదని అందరికీ తెలిసిందే అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం తన రాజకీయ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్నారు. పైగా సీబీఐ విచారణ కోరటంలో తప్పేమందంటూ రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. వైసీపీ ఆడిస్తోన్న నాటకంలో భాగంగా ఉండవల్లి మార్క్ రాజకీయాలను ప్రదర్శించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో సీబీఐ విచారణ జరిపితే అటు చంద్రబాబుకు, ఇటు సీఎం జగన్‌కు మేలు జరుగుతుందని ఉండవల్లి వాదన. అసలు కేసే లేదంటూ న్యాయవాదులు సైతం చెబుతున్న వాదనను పట్టించుకోకుండా ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఎలా సమర్థనీయమవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా పెట్టిన ఈ కేసులో చంద్రబాబు బెయిల్ కోరకుండా స్వ్కాష్ కోరటం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అరుణ్‌కుమార్ మరో మూర్ఖపు వాదనను ప్రస్తావించారు.
బెయిల్‌పై బయటకొస్తే చంద్రబాబు నిర్దోషిత్వం బయటపడదు, పైగా ఎప్పటికప్పుడు ఈ కేసు విచరాణ అంటూ ప్రభుత్వం ఆయన్ను ఇబ్బందులపెట్టే అవకాశముంది. కేసు అవాస్తమవని తేలితే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్న విషయం మరచిపోయి ఉండవల్లి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు ఆయన రాజకీయ సన్నిహితులు.
దీనికి తోడు తెలుగుదేశంతో జనసేన పొత్తు విషయంలోనూ ఉండవల్లి విషం చిమ్ముతున్నారు. జగన్ ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్న ఉండవల్లికి ఈ రెండు పార్టీల పొత్తు వల్ల జరిగేదేమిటో ముందే ఊహించే ఇలా మాట్లాడుతున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఏం జరిగినా ఉండవల్లి తట్టుకోలని, అందుకే ఈ తరహా ఆరోపణలుచేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగుదేశం, జనసేన పార్టీలపై విషం చిమ్మటం ఉండవల్లి మానుకోవాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.