మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ డెబ్యూ మూవీ ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమర్ శిష్యుడు, కొత్త కుర్రోడు బుచ్చిబాబు సాన దర్శకుడు. కృతి శెట్టి కథానాయికగా పరిచయం అవుతోన్న ఈ సినిమాలో విలన్ పాత్రను తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి అద్వితీయమైన రీతిలో పోషిస్తున్నాడు.
మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఉప్పెన ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. యంగ్ టైగర్ యన్టీఆర్ ఉప్పెన ట్రైలర్ ను ఆవిష్కరించడం టాలీవుడ్ లో విశేషంగా మారింది. విడుదలయిన కొన్ని నిమిషాల్లోనే ట్రైలర్ విశేషమైన వ్యూస్ సాధించడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది.
Must Read ;- ‘ఉప్పెన’ బుచ్చిబాబు మరో భారతీరాజా అన్నదెవరు?
ఇదో విషాదమైన ప్రేమ కథని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. సముద్ర తీరప్రాంతమైన ఒ గ్రామంలో ఒక ధనిక కుటుంబానికి చెందిన ఒక అందమైన యువతిని ఒక పేదింటి యువకుడు ప్రేమించడం.. ఆ అమ్మాయి తండ్రి వారి ప్రేమని ఒప్పుకోకపోవడం.. దానికి అడ్డంకులు సృష్టించడం .. ఆపై ఆ ప్రేమికులు కష్టాలు పడడం.. ఈ ట్రైలర్ లో కనిపించాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి హైలైల్ కాబోతోందని అర్ధమవుతోంది.
దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలోని పాటలు .. విడుదలకు ముందే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాట.. ఇప్పటికీ ట్రెండింగ్ గా ఉంది. మరి ఉప్పెన సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
Must Read ;- టీజర్ టాక్: యువజంటలో ‘ఉప్పెన’లా వెల్లువెత్తిన ప్రేమ