పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ భారీ క్రేజీ మూవీకి ఏంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది బాలీవుడ్ లో సక్సస్ సాధించిన పింక్ మూవీకి రీమేక్ కావడం.. పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ కావడంతో… వకీల్ సాబ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక పవర్ స్టార్ అభిమానులు అయితే… ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం సమ్మర్ లోనే ‘వకీల్ సాబ్’ థియేటర్లోకి రావాలి కానీ… కరోనా కారణంగా ఆగింది.
అయితే… కొత్త సినిమాలు అన్నీ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుండడంతో… వకీల్ సాబ్ కూడా సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి రావడం పక్కా అనుకున్నారు. దసరాకి టీజర్ రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు. దీంతో దీపావళికి ‘వకీల్ సాబ్’ టీజర్ వస్తుంది అనుకుంటే… ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పుడు అసలు విషయం తెలిసింది. అది ఏంటంటే… వకీల్ సాబ్ సంక్రాంతికి రావడం లేదని.
కారణం ఏంటంటే… దిల్ రాజు వకీల్ సాబ్ ని సంక్రాంతికే రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే… పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అనుకోకుండా పాలిటిక్స్ లో బిజీ కావడంతో షూటింగ్ కి బ్రేక్ చెప్పాల్సివచ్చింది. దీంతో ‘వకీల్ సాబ్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి మిస్ అయితే… ఇక సమ్మర్ లోనే వకీల్ సాబ్ రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్ మారిందని తెలిసింది. మేటర్ ఏంటంటే… వకీల్ సాబ్ మూవీని ఉగాదికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. సాధ్యమైనంత త్వరగా పవన్ తో షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని మగువా మగువా సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను జనవరిలో అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.