సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార. సోషల్ మీడియాలో యమా.. యాక్టివ్‌గా ఉంటుంది. నాన్న మహేష్ సినిమా రిలీజ్ అయితే.. చాలు ఆ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేయడం.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇంకా చెప్పాలంటే.. చిన్న వయసులోనే సెలబ్రిటీ అయ్యింది. అమ్మా, నాన్నా అంటే సితార పాపకు చాలా ఇష్టం. అలాగే సితార పాప అంటే మహేష్, నమ్రతకు కూడా అంతే ఇష్టం. అందుకనే సితారకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ సంతోషాన్ని షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉంటే.. ప్రేమికుల రోజున పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది సితార. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్, నమ్రతకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది సితార. దాని పై లవ్ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్ అందడంతో మహేష్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురు పై ప్రేమను కురిపించింది.
ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. స్నేహారెడ్డిని బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా బన్నీ, భార్య స్నేహ నుంచి ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అందుకున్నారట. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బన్నీ స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ క్యూటీ. హ్యాపీ వాలెంటైన్ డే అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. 2011 మార్చి 6న పెళ్లి చేసుకున్న బన్నీ, స్నేహ దంపతులకు అయాన్, ఆర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తుంటే.. బన్నీ పుష్ప సినిమా చేస్తున్నారు.
Must Read ;- లవర్స్ డే రోజే ‘లవ్ మాక్ టైల్’ జంటకు ముడి











