టీడీపీ యువనేత, మంత్రి లోకేష్.. గత కొంతకాలంగా చెబుతోన్న రెడ్ బుక్‌లోని కీలక పేజ్ ఓపెన్ అయిందా.?? వైసీపీలో కొత్త గుబులు మొదలయిందా.?? రెడ్ బుక్ ఓపెన్ అయిన పేజ్ సౌండ్‌కి తాడేపల్లి ప్యాలెస్‌లో టెన్షన్‌తో కూడిన భయం తాలూకు గౌరవం పెరిగిందా.?? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్‌ఎల్‌ఏ వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.. గన్నవరం టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్‌ని బెదిరించి కేసు విత్ డ్రా చేసుకునేలా చేయడంతోపాటు, ఆయనని కిడ్నాప్ చేశారనే అభియోగాలతో పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మై హోమ్ భుజాలో ఉన్న వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు..
ఈ అరెస్ట్ వెనక లోకేష్ రెడ్ బుక్ ఉందని, వైసీపీ నేతలు ఒక్కొక్కరు కలుగులోనుండి బయటకు వచ్చి మరీ ఆర్తనాదాలు చేస్తున్నారు.. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని స్పీచులు దంచుతున్నారు.. వారిలో లోకేష్ యువగళం సందర్భంలో చెప్పిన రెడ్ బుక్ పని ఇప్పుడు మొదలయిందని వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ నేతలు..
వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో వైసీపీలోని కొంతమంది నేతలు ఉలిక్కిపడ్డారు.. 2019 నుండి 24 మధ్య టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై బూతులతో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు కొందరు. ఈ నేతలందరికి నాడు యువనేత లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు అంత అనుభవిస్తారని, వారిపై కేసులు తప్పవు అని, తప్పు చేసిన వైసీపీ నేతలకు వాత తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. నాడు అధికారంలో ఉండగా అరాచకంగా ప్రవర్తించిన, రూల్స్, రెగ్యులేషన్స్‌ని తుంగలో తొక్కిన అధికారులు, నేతల కోసం తాను రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నానని, వారి పేర్లను అందులో నోట్ చేసుకుంటున్నానని హెచ్చరించారు. ఈ లిస్టులో తాజాగా వల్లభనేని వంశీ పేరు ఉందని, కాస్త లేట్ అయినా, లేటెస్ట్‌గా అరెస్ట్ అయ్యారని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.. త్వరలోనే మరికొంతమంది ఇదే బాటలో అరెస్టుల కాక తప్పదని భావిస్తున్నారు వైసీపీ నేతలు..
ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, కేవలం చట్టబద్ధమైన పాలన అని చెబుతున్నారు టీడీపీ నేతలు.. అధికారంలో ఉన్న అయిదేళ్లు అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా బుల్డోజర్లు, పోలీసులతో గోడలు దూకి మరీ ఇళ్లల్లోకి ఎంటర్ అయిన పోలీసులను చూశాం కానీ, నేడు సీన్ మారిపోయిందని గుర్తు చేస్తున్నారు…. పట్టపగలు ఉదయం సమయంలో పోలీసులు వల్లభనేని వంశీ ఉన్న ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ వారెంట్ చూపి, జీపు ఎక్కించారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అయితే కథ వేరేలా ఉండేదని ఇది, చట్టబద్ధంగా వల్లభనేని వంశీ చేసిన తప్పుల కారణంగానే అరెస్ట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ నేతలు..
ఏది ఏమైనా, ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. వల్లభనేని అరెస్ట్‌తో జగన్ టీమ్‌లో కలవరం మొదలయింది.. ముఖ్యంగా, నాడు నోటికి పని చెప్పినవారికి నేడు జైలు బాట పడుతున్నారు.. రాబోయే రోజుల్లో మరెంతమంది ఇదే రీతిలో అరెస్ట్ అవుతారో చూడాలి..