సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రైతుల గురించి తీసిన ఈ సినిమా మహేష్ బాబుకు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలనుకున్నారు మహేష్. ఈ మూవీని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. అంతా ఓకే.. త్వరలో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అనుకుంటే.. కథ విషయంలో మహేష్ సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆతర్వాత వంశీ పైడిపల్లి.. రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనకున్నారు. చరణ్ కి కథ చెప్పారు కానీ.. అక్కడ కూడా కథ నచ్చకపోవడంతో ముందుకు వెళ్లలేదు. అప్పటి నుంచి వంశీ ప్రయత్నం చేస్తునే ఉన్నారు. తాజాగా వంశీ పైడిపల్లి మహేష్ కోసం ఇంట్రస్టింగ్ స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. మహేష్… వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. 2021 ద్వితీయార్ధంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయాలనేది మహేష్ ఇంకా ఫైనల్ చేయలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు మహేష్ ఓకే చెప్పారట. వంశీ పైడిపల్లి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని.. త్వరలోనే మహేష్ కి వంశీ కథ చెప్పనున్నారని తెలిసింది. ఈసారి కనుక మహేష్ ని మెప్పిస్తే.. సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఈ మూవీని దిల్ రాజు – పివిపి సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిసింది. 2021 ద్వితీయార్ధంలో ఈ సినిమాని స్టార్ట్ చేస్తారు.
Must Read ;- చిరు సినిమాలను.. మహేష్, పవన్, ఎన్టీఆర్ రీమేక్ చేస్తే..?