వనితా విజయ్ కుమార్.. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. ఈమె సినీ నటులు విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె. ఆమె నటించిన సినిమాలు తక్కువే. అయితే… సినిమాల గురించి కన్నా.. ఆమె పర్సనల్ విషయాల వలనే ఎప్పుడూ ఆమె పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, విడాకులు… ఈ విషయాల గురించే ఆమె వార్తల్లో ఉంటుంది. ఈమె ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుంది. ఇటీవల పీటర్ ను పెళ్లి చేసుకోవడం.. ఆతర్వాత ఇద్దరూ గొడవ పడడం తెలిసిందే. కోలీవుడ్ లో వనితా విజయ్ కుమార్ ఓ సంచలనం.
ఈ వివాదస్పద నటి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ విషయం ఏంటంటే.. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్న టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో తమకు అనుబంధం ఉండేదని.. చిరంజీవి ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ కి మా ఫ్యామిలీ మొత్తం వెళ్లేవాళ్లమని చెప్పింది. చిరంజీవి సినిమా ఓపెనింగ్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అల్లు అర్జున్ చాలా స్టైలీష్ గా తయారైయ్యాడు. అప్పుడు నా వైపు చూస్తూ.. నాకు లైన్ వేసాడని చెప్పింది. అప్పుడు అల్లు అర్జున్ వయసు 14 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పింది.
అంతే కాకుండా తనకన్నా చిన్నవాడైనా సరే.. తనకు లైన్ వేసాడని చెప్పి వార్తల్లో నిలిచింది. బన్నీ సూపర్ డ్యాన్స్ ర్.. అల్లు అర్జున్ కి అత్తగా నటించాలని వుందని.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటుంది. ఇక మీ ఫేవరేట్ హీరో ఎవరంటే.. జూనీయర్ ఎన్టీఆర్ అని.. ఎన్టీఆర్ తో కూడా నటించాలనుకుంటున్నాను అని చెప్పింది. మరి.. బన్నీ, ఎన్టీఆర్ లతో నటించాలనే ఈ వివాదస్పద నటి ఆశ తీరుతుందో లేదో..?
Must Read ;- న్యూ ఇయర్లో అనుపమ జోరు!