స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా లో నటిస్తున్నాడు. ఇందులో బన్నీ ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఒకటి ఉందట. దాని కోసం ముందుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించాడు సుకుమార్. కాని ఈ ప్రాజెక్ట్ నుంచి అతడు తప్పుకున్నాడు.
ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఒక మంచి నటుడ్ని వెతికే పనిలో పడ్డాడు సుకుమార్. చాలామంది నటుల్ని వెతికిన సుక్కు చివరకు తమిళ్ హీరో ఆర్యను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాలో పవర్ ఫుల్ గా ఉండడంతో దానికి ఆర్య అయితే సరిపోతాడని సుకుమార్ భావిస్తున్నాడట. గతంలో బన్నీ నటించిన ‘వరుడు’ లో ఆర్య విలన్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో .. దీంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా లో ఆర్య పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.