వరుణ్ సందేశ్ హీరోగా .. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా ‘ఇందువదన’ రూపొందింది. ఆదుర్తి మాధవి నిర్మించిన ఈ సినిమాకి, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహించాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ గిరిజన యువతికి .. ఆ అడవికి వచ్చిన ఆఫీసర్ కి మధ్య నడిచే ప్రేమకథ ఇది అనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది.
తరచూ ఆ యువతి .. ఆఫీసర్ కలుసుకోవడం .. కబుర్లు చెప్పుకోవడం .. కలిసి పాటలు పాడుకోవడం చేస్తుంటారు. ఇది నచ్చని గూడెం ప్రజలు వాళ్ల ప్రేమకు అడ్డుచెబుతారు. అయినా ఆ ప్రేమజంట వినిపించుకోదు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? కథ ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది? అనే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ టీజర్ ను కట్ చేశారు. చివర్లో దెయ్యాన్ని చూపించి, సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.
చాలా గ్యాప్ తరువాత వరుణ్ సందేశ్ చేసిన సినిమా ఇది. ఆయన ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక కథానాయికగా తెరపై అందంగా మెరుస్తున్న ఫర్నాజ్ శెట్టికి తెలుగులో ఇదే తొలి సినిమా. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాగినీడు .. సురేఖావాణి .. ధన్ రాజ్ .. పార్వతీశం కనిపించనున్నారు.
Must Read ;- తిమ్మరుసు (రివ్వ్యూ)











