బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ఒంగోలు సర్వాంగ సుందరంగా తయారైంది. మొదట అనుకున్న ప్రదేశం కాకుండా వేరొక చోటుకు వెన్యూ మార్చారు. ఇక్కడ ఉత్తర బైపాస్ పక్కన.. మండువ వారి సమీపంలో ఉన్న అర్జున్ ఇన్‌ఫ్రా ప్రాంగణంలో భారీ స్టేజీని నిర్మించారు. ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్ లను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాలయ్య, ఆ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్ ఒంగోలుకు చేరుకున్నారు. గౌండ్ కు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేడుకకు హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్, దర్శకుడు మలినేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్, శివమణి, పలువురు గాయనీ గాయకులు హాజరవుతున్నారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 45 నిమిషాలు సంగీత విభావరి ఉంటుంది. ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు ఈవెంట్ నిర్వాహక సంస్థ అధినేత శ్రేయ శ్రీనివాసరావు ముందే చెప్పారు.
ఇందుకోసం మోస్ట్ ఇంపార్టెంట్ (ఎంఐపీ), సామాన్య పాసులు జారీ చేశారు. ఎంఐపీ పాసులు ఉన్న దాదాపు 8వేల మంది కూర్చుని చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రీరిలీజ్ వేడుకకు వృద్ధులు, చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకురావద్దని కూడా నిర్వాహకులు హెచ్చరించారు. బాలయ్య అభిమానులు ఆనందోత్సాహాలకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.