విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నారప్ప మూవీతో పాటు వెంకీ ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. వెంకీ – వరుణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. వెంకీ.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం.. తరుణ్ భాస్కర్ రెడీ చేసిన స్క్రిప్ట్ కి వెంకీ, సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
వెంకీ కోసం సరికొత్త బ్యాక్ డ్రాప్ అయిన హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ తో రెడీ చేసిన ఈ కథలో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందట. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే.. మే నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
Must Read ;- వెంకీ నిర్ణయంతో.. అప్ సెట్ అయిన శ్రీకాంత్











