ఒకప్పుడు తమిళ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఎంతోమంది ప్రముఖులకు డబ్బింగ్ చెప్పి, ఎన్నో పాటల్ని పాడిన ఏవీయన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. విజయ నగరం జిల్లాకు చెందిన ఏవీయన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఆయన కూడా ఎందరో టాప్ స్టార్స్ కు వాయిస్ ఇచ్చారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియచేశారు.
Must Read ;- కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి