‘ఛలో తుంగభద్ర’ పేరుతో తమ నిరసన తెలియజేయడానికి సిద్ధమయ్యారు వీహెచ్ పీ, బిజెపి నేతలు. కానీ వారి నిరసన ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులు వారిని అరెస్టులు సైతం చేయాల్సివచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది?
సంప్రదాయాన్ని హరించిన కరోనా
12 సంవత్సారాలకు ఒక్కసారి వచ్చే పండుగలాంటిది పుష్కరం. సాధారణంగా అయితే లక్షల్లో భక్తులు పుష్కర ఘాట్ ని దర్శించి, అందులో స్నానమాచరిస్తే తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కానీ, మాయదారి కరోనా కారణంగా తుంగభద్ర పుష్కరాలు వచ్చాయనే మాటే కానీ, నదీ స్నానమనే సంప్రదాయాన్ని పాటించకుండా చేసింది. పుష్కరిణి నదిలో స్నానం చేయడం ప్రభుత్వం నిషేధం విధించడంతో, చాలా మంది ప్రజలు నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానమాచరించి ‘మమ’ అనిపించుకుంటున్నారు.
అరెస్టులు… అరుపులు…
వీహెచ్ పీ, బిజెపి నేతలు ‘ఛలో తుంగభద్ర’ పేరుతో పుష్కరిణి స్నానమాచరించడానికి హాజరయ్యారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పుష్కరిణి గట్లపైన తిరిగిన వారిని స్నానమాచరించిన వారిని పోలీసులు లాగి మరీ పోలీసు వ్యానెక్కించారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు భక్తులు పోలీసులను ప్రశ్నిస్తున్నా వినకుండా వారిని లాక్కెళ్లినట్లు సమాచారం.
ఎందుకు 230 కోట్లు?
పుష్కర ఏర్పాట్లకు 230 కోట్లు వెచ్చించామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యస్పదంగా ఉందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పుష్కర ముఖ్య ఉద్దేశమే నదీ స్నానమని, దానిని నిషేధించిన దానికి ఇంత ఖర్చుపెట్టి ఏం ఏర్పాట్లు చేశారని వారు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిధేషం ఉందని భక్తులతో ఇంత దురుసుగా ప్రవర్తించిన పోలీసులు, కొన్ని ప్రదేశాల్లో ఎమ్మెల్యే వెసులుబాటు ఇవ్వడంతో నదీ స్నానాలు చేస్తున్నా చూసి చూడకుండా ప్రవర్తించారని విమర్శలపాలవుతున్నారు.
జాగ్రత్త అవశరమే
కరోనా కాలంలో నదీ స్నానం నిషేధ నియమం ప్రజల ఆరోగ్యం కోసమే కావచ్చు. కానీ పుష్కర ఉద్దేశమే స్నానమాచరించడం అయినపుడు దానిని నిషేధించాలని నిర్ణయించకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రజలకు అవగాహాన కల్పించి ఉంటే ఇంత గందరగోళం నెలకొని ఉండకపోవచ్చు. వేరు వేరు ప్రాంతాల నుండి చాలామంది భక్తులు అక్కడి దాకా వచ్చిన తర్వాత పుష్కరిణికి అనుమతి లేదని తెలిసి నిరాశ చెందుతున్నారు.
Must Read ;- ఎవరీ పుష్కరుడు.. అతని వెనకున్న కథలు ఏమిటి?